ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలు ప్రకటించనున్న సీఎం జగన్

By Nagaraju penumalaFirst Published Oct 7, 2019, 12:55 PM IST
Highlights

ఈ నెల 16న జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన నేపథ్యంలో ఆ అంశంపై చర్చించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 

అమరావతి: ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 16న ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

ఈనెల 16న జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన నేపథ్యంలో ఆ అంశంపై చర్చించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 

అలాగే అమ్మఒడి, ఉగాదికి ఇళ్లపట్టలా పంపిణీ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ఇటీవలే విధుల్లో చేరిన గ్రామ వాలంటీర్ల జీతాలు పెంచే అంశంపై సీఎం జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం గ్రామవాలంటీర్లకు రూ.5000 వేతనం ఇస్తున్న నేపథ్యంలో ఆ వేతనాన్ని రూ.8వేలకు పెంచే అంశంపై సీఎం కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత సీఎం వైయస్ఆర్ విగ్రహప్రతిష్ట, సోషల్ మీడియా వంటి అంశాలపై చర్చించనున్నారు. 

 

click me!