తిరుమల వెంకన్నలో దేవున్ని చూశారా? రాయిని చూశారా?: సిపిఐ నారాయణను నిలదీసిన విష్ణువర్ధన్

By Arun Kumar P  |  First Published Jan 4, 2021, 11:35 AM IST

గాంధేయవాదం గురించి మాట్లాడతారు, గాంధీ జయంతి రోజు హింసా మార్గాన్ని ఎంచుకోని చికెన్ తింటారు అంటూ సిపిఐ నేత నారాయణపై బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సెటైర్లు విసిరారు. 


అమరావతి: హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి హిందువులను ఆవమానించిన సిపిఐ నేత నారాయణ హిందువులకు క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీల మాదిరిగానే ఆ పార్టీ నాయకుడు నారాయణకు కూడా వయసైపోయిందని... అందుకే ఇలాంటి  వివాదస్పద మాటలతో మీడియా ప్రచారంతో కాలం వెల్లబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు.

''కమ్యూనిస్టుల మాటలకు చేతలకు ఏనాడు పొంతన ఉండదు. నిన్ననే దేవాలయాల గురించి దొంగ ఏడుపులతో ప్రకటనలు ఇచ్చారు. ఇవాళ హిందూ దేవుళ్లను రాతితో పోలుస్తున్నారు'' అన్నారు.

Latest Videos

''గాంధేయవాదం గురించి మాట్లాడతారు, గాంధీ జయంతి రోజు హింసా మార్గాన్ని ఎంచుకోని చికెన్ తింటారు . నారాయణ గారు కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్ళారు. మరి తిరుమలలో  మీరు, మీ కుటుంబం రాతిని చూసారా? వెంకటేశ్వరుడిని దేవుడిగా చూశారా? అసలు తిరుమలలో ఏముందని మీరు మీ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు'' అని నిలదీశారు.

''కమ్యూనిస్టు ఒకవైపు దేవుళ్ళను అవమానిస్తారు. వీరికి ఇది అలవాటుగా మారింది. మరోవైపు రాష్ట్రంలో దేవాలయాలను రక్షించమని మరో నేత రామకృష్ణ  మాట్లాడతారు. దేవుళ్ళను రాతితో పోల్చే కమ్యునిష్టులు, దేవుళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉంది?'' అన్నారు.

''అసలు మీ పేరులోనే దేవుడున్నాడు ( నారాయణ-వెంకటేశ్వరస్వామి)అది తెలుసుకో. మీ పేరు కూడ మీరు అంటున్న రాతి పేరే. నేడు మీ పేరుమార్చుకుంటారా?ఓకరేమో సీతరాం ఏచూరి (రాముడు), ఇంకొకరేమో రామక్రిష్ణ( రాముడు ,క్రిష్ణుడు)'' అని పేర్కొన్నారు.

''రైతులు,వాళ్ళ జీవితాలను మార్చే ఉపయోగమైన బిల్లును వ్యతిరేకంగా ఉద్యమం చేసి, వారి ఉద్యమంతో చలికాచుకునే  కమ్యూనిస్టులు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుంది'' అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. 

click me!