చంద్రబాబుపై కేసులు వేస్తే కోర్టులకు టైం చాలదు:సోము

Published : Sep 26, 2018, 03:19 PM IST
చంద్రబాబుపై కేసులు వేస్తే కోర్టులకు టైం చాలదు:సోము

సారాంశం

సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. చంద్రబాబుపై కేసులు వేస్తే కోర్టులకు సమయం చాలదని స్పష్టం చేశారు. 

కాకినాడ: సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. చంద్రబాబుపై కేసులు వేస్తే కోర్టులకు సమయం చాలదని స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ సీఎం అవినీతిమయం చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన 6,500కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవన్నారు.

మరోవైపు అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ అని సోము ఘాటుగా విమర్శించారు. ప్రకృతి వ్యవసాయం తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పాలేకర్‌ కనిపెట్టారని సోము వీర్రాజు గుర్తు చేశారు. యూఎన్ వోలో ప్రకృతి వ్యవసాయాన్ని చంద్రబాబు హైజాక్ చేశారని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు