చంద్రబాబుకు షాక్: పనబాక లక్ష్మి వ్యాఖ్యలను ట్వీట్ చేసిన సోము వీర్రాజు

Published : Mar 30, 2021, 09:58 AM IST
చంద్రబాబుకు షాక్: పనబాక లక్ష్మి వ్యాఖ్యలను ట్వీట్ చేసిన సోము వీర్రాజు

సారాంశం

తిరుపతి ప్రస్తుత లోకసభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. పనబాక లక్ష్మి చేసిన వ్యాఖ్యల వీడియోను దానికి జతచేశారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోకసభ ఎన్నికల్లో మాటల యుద్ధం ప్రారంభమైంది. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చారు. టీడీపీ తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను చంద్రబాబుకు కూడా ట్యాగ్ చేశారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో తెలియదా అంటూ పనబాక లక్ష్మి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను తన వ్యాఖ్యలకు జత చేశారు నాడు.. బాబు గురించి నేటి టీడీపీ తిరుపతి లోకసభ అభ్యర్థి పనబాక లక్ష్మిగారి మాట్లలో... అంటూ ఆమె వీడియోను ట్వీట్ చేశారు. 

తిరుపతి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మీగారు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వర్ణించిన సన్నివేశం మీ కోసం.. అని వ్యాఖ్యానిస్తూ ఆ వీడియోను తన శీర్షికతో జత చేశారు.

 

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో పనబాక లక్ష్మి టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా, బిజెపి - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి గురుమూర్తి, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ పోటీ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?