టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉపవాస దీక్ష

By narsimha lode  |  First Published May 26, 2020, 10:23 AM IST

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ  ఏపీ రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇవాళ ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్షలు సాగిస్తారు.



తిరుమల: తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ  ఏపీ రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇవాళ ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్షలు సాగిస్తారు.

న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ ధియోదర్ లు దీక్షకు దిగారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయయణతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు.

Latest Videos

undefined

also read:జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీటీడీ భూముల అమ్మకం నిలిపివేత, మళ్లీ అప్పుడే

టీటీడీ ఆస్తులను విక్రయించాలని 2016 జనవరిలో అప్పటి టీటీడీ బోర్డు చేసిన నిర్ణయాన్ని అభయన్స్ లో పెడుతూ సోమవారం నాడు రాత్రి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను చూస్తే భూముల విక్రయంలో ప్రభుత్వ చిత్తశుద్ది తేటతెల్లం అవుతోందన్నారు. ఈ జీవో నాలుక గీసుకోవడానికి కూడ పనికిరాదన్నారు.

also read:సదావర్తి భూముల విక్రయాన్ని నాడు వద్దన్నారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు: వైసీపీపై ఐవైఆర్ ఫైర్

టీడీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో సదావర్తి భూముల విషయంలో, టీటీడీ భూముల విక్రయం విషయంలో  వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  గుర్తు చేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని టీటీడీకి చెందిన భూములను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. అయితే గత పాలకవర్గం తీసుకొన్న నిర్ణయాన్ని అమలు చేయాలని టీటీడీ పాలకవర్గం చెబుతోంది.ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయమై టీటీడీ ఛైర్మెన్ వైవీసుబ్బారెడ్డి సోమవారం నాడు వివరణ ఇచ్చారు. 


 

click me!