ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలో రెండు రోజుల్లో స్పష్టత: పొత్తులపై పురంధేశ్వరి

By narsimha lode  |  First Published Mar 10, 2024, 12:15 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేనిఫెస్టోలో  పొందుపరుస్తామని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి చెప్పారు.


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో  పొత్తు ఖరారైందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు.ఆదివారంనాడు  బీజేపీ ప్రచార రథాలను  పురంధేశ్వరి  విజయవాడలో  ప్రారంభించారు.ఏ పార్టీ  ఎక్కడనుంచి పోటీ చేయాలనేది రెండు రోజుల్లో తేలనుందని పురంధేశ్వరి తెలిపారు.దుష్టశిక్షణ... శిష్టరక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నట్టుగా పురంధేశ్వరి చెప్పారు.రాష్ట్ర హితంకోసం అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉంటామన్నారు.

also read:ముహుర్తం ఫిక్స్: వైఎస్ఆర్‌సీపీలోకి ముద్రగడ పద్మనాభం

Latest Videos

undefined

పదేళ్లుగా ప్రధాని మోడీ దేశానికి ఎంతో సేవ చేసినట్టుగా  పురంధేశ్వరి చెప్పారు.వచ్చే ఐదేళ్లలో ఏం చెయ్యబోతున్నామో ప్రచార రథాల ద్వారా వివరిస్తామని పురంధేశ్వరి వివరించారు. బీజేపీ మూల సిద్దాంతం అట్టడుగు వర్గాల సంక్షేమమేనని తెలిపారు.

also read:రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ప్రచార రథాలలో రెండు బాక్సులు ఉంటాయన్నారు.ఒక బాక్సులో కేంద్రంనుంచి మీరేమీ ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరించనున్నట్టుగా ఆమె చెప్పారు. మరో బాక్సులో రాష్ట్రంకోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తామన్నారు.కోటిమంది అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఆమె తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మానిఫెస్టోలో చేరుస్తామన్నారు.

టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా శనివారం నాడు ప్రకటించారు. ఈ విషయమై  మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడ జరిగింది. జనసేన,బీజేపీకి 30 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ స్థానాలను తెలుగు దేశం పార్టీ కేటాయించింది. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది.  ఈ నెల  7, 9 తేదీల్లో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చర్చించారు.ఈ చర్చల తర్వాత జేపీ నడ్డా మూడు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 

 


 

click me!