జగన్ వెన్నులో వణుకు: పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు బిజెపి ట్విస్ట్

By narsimha lodeFirst Published Apr 9, 2021, 3:22 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ క్రేజ్ ను చూసి ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేశారని బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ దేవధర్ ఆరోపించారు. 

తిరుపతి:పవన్ కళ్యాణ్ క్రేజ్ ను చూసి ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేశారని బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ దేవధర్ ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. జనసేన-బీజేపీ కూటమి క్రేజ్ ను చూసి ఓర్వలేకనే షో ల ను రద్దు నిలిపివేశారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయపడ్డారని, అందుకే బెనిఫిట్ షోలను అడ్డుకున్నారని ఆయన అన్నారు. వకీల్ సాబ్ సినిమాకు బిజెపి నేతలు రాజకీయ కోణాన్ని జత చేశారు.

ఏపీ రాష్ట్రంలో వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. బీజేపీ అగ్రనేతలు ఈ విషయమై ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తాను పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు వస్తే బెనిఫిట్ షో  రద్దు చేసిన విషయం తెలుసుకొన్న దేవ్ ధర్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ తో భయం వల్లే ఈ నిర్ణయం తీసుకొన్నారని ఆయన విమర్శించారు.పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకే జగన్ భయపడుతున్నారని ఆయన చెప్పారు.

తాను పవన్ కల్యాణ్ సినమా చూడడానికి వచ్చానని, పవన్ కల్యాణ్ కు భయపడి జగన్ షోలను రద్దు చేయడం దురదృష్టకరమని సునీల్ దేవధర్ అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదలకే జగన్ భయపడితే, మోడీ - పవన్ కల్యాణ్ రాజకీయం జోరు సాగితే ఇంకెలా భయపడుతారని ఆయన అన్నారు. 

వైసీపీ రౌడీయిజం, అవినీతి రాజకీయం, మత మార్పిడులు సాగిస్తున్నారని ఆయన అన్నారు. తాను వకీల్ సాబ్ సినిమా చూస్తానని ఆయన చెప్పారు. అందరూ తప్పకుండా చూడాలని సూచించారు.

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు జగన్ భయపడుతున్నారని మరో బిజెపి నేత సత్య అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఆపారంటే జగన్ వెన్నులో వణుకు ప్రారంభమైందని అర్థమని ఆయన అన్నారు. రౌడీ ఎమ్మెల్యేలను, రౌడీ మంత్రులను పెట్టి జగన్ దౌర్యన్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

జగన్ కు భయపడడానికి బిజెపి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కారని, టీడీపీ కార్యకర్తల మాదిరిగా లోపాయికారి ఒప్పందాలకు తలొగ్గరని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు అవినీతికి దూరంగా ఉంటారని ఆయన చెప్పారు. 

వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై కొన్ని చోట్ల  అభిమానులు థియేటర్లపై దాడికి దిగారు.ఏపీ రాష్ట్రంలో బీజేపీ-జనసేన కూటమి మధ్య పొత్తు కొనసాగుతోంది. ఈ పొత్తులో భాగంగా తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తున్నారు.  బీజేపీ తన అభ్యర్ధిగా రత్నప్రభను బరిలోకి దింపింది.

click me!