హోం మంత్రి సుచరితకు చేదు అనుభవం..!

Published : Sep 02, 2021, 10:09 AM IST
హోం మంత్రి సుచరితకు చేదు అనుభవం..!

సారాంశం

రాష్ట్ర మద్య విమోచన కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డి టంగుటూరు మండలంలోని తన స్వగ్రామం కారుమంచిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితకు ప్రకాశం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. రాజకీయాలతో సంబంధం లేకుండా.. ఆమె ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. ఆ కార్యక్రమానికి.. వైసీపీ నేతలు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం గమనార్హం.

స్థానిక రాజకీయ పరిస్థితులను తెలుసుకోకుండా, జిల్లా మంత్రి బాలినేనికి కానీ, నియోజకవర్గ ఇన్‌చార్జికి కానీ సమాచారం ఇవ్వకుండా ఆమె కార్యక్రమానికి హాజరవడమే సమస్యకు కారణంగా భావిస్తున్నారు. రాష్ట్ర మద్య విమోచన కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డి టంగుటూరు మండలంలోని తన స్వగ్రామం కారుమంచిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 

కార్యక్రమానికి హోంమంత్రి సుచరితతోపాటు మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ వెంకయ్య హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం హోంమంత్రి వచ్చినా మిగిలిన వారెవ్వరూ హాజరు కాలేదు. స్థానిక పరిస్థితులను తెలుసుకోకుండా, జిల్లా మంత్రితో మాట్లాడకుండా ఇక్కడకు రావడం సమంజసం కాదని జిల్లా నాయకులు మంత్రి సుచరితతో అన్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu