జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం

Published : Aug 02, 2019, 01:48 PM IST
జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం

సారాంశం

తాడిపత్రి మండలం తలారి చెరువులో సోలార్ ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాడిపత్రి మండలం తలారి చెరువులో సోలార్ ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఈ సందర్భంగా స్థానికులు జేసీ ప్రభాకర్ రెడ్డిని నిలదీశారు.

అధికారంలో ఉండగా కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కాగా... స్థానికులు అడ్డుకోవడంతో... వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే.. జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా... అక్కడి స్థానికులకు ఈ విషయంలో వైసీపీ నేతలు అండగా నిలవడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్