ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: బాబుతో భువనేశ్వరి,బ్రహ్మణి ములాఖత్

By narsimha lode  |  First Published Sep 25, 2023, 4:17 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు  ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిశారు. 


రాజమండ్రి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడితో  ఆయన భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మణి, ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారంనాడు ములాఖత్ అయ్యారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును ఈ నెల  9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో  చంద్రబాబు జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ వరకు  చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.

ఇదిలా ఉంటే జైల్లో ఉన్న చంద్రబాబును భువనేశ్వరి, బ్రహ్మణి కలవడం ఇది రెండో సారి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో  ఈ నెల  18వ తేదీన  చంద్రబాబును భువనేశ్వరి, బ్రహ్మణి, లోకేష్ కలిశారు.  ఆ తర్వాత కూడ  చంద్రబాబుతో ములాఖత్ కోసం  భువనేశ్వరి ధరఖాస్తు చేసుకున్నారు. అయితే భువనేశ్వరి దాఖలు చేసిన అప్లికేషన్ ను జైలు అధికారులు తోసిపుచ్చారు. ఈ విషయమై  జైలు అధికారుల తీరును భువనేశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ  సాయంత్రం  భువనేశ్వరి, బ్రహ్మణిలతో పాటు అచ్చెన్నాయుడు  చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.ఇవాళ కోర్టులో జరిగిన వాదనలు... రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను  చంద్రబాబుకు వివరించారు.

Latest Videos

ఇవాళ ఉదయమే అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో  భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుండి జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికంగా ఉన్న ప్రజలనుద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు. ప్రజల కోసం నిత్యం ఆలోచించే చంద్రబాబుకు  ప్రజల సొమ్మును దోచుకొనే అలవాటు లేదని  భువనేశ్వరి వ్యాఖ్యానించారు. తమ సంస్థలో రెండు శాతం వాటా అమ్ముకుంటేనే తమకు రూ. 400 కోట్లకుపైగా డబ్బులు వస్తాయని  భువనేశ్వరి చెప్పారు. కష్టకాలంలో తమకు అండగా ఉన్నవారికి ఆమె పేరు పేరును ధన్యవాదాలు తెలిపారు.ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ పిటిషన్లు,  కస్టడీ పిటిషన్లపై  ఏసీబీ కోర్టు రేపు విచారించనుంది. 

click me!