చంద్రబాబు అండ్ కో 4లక్షల కోట్లు దోచుకున్నారు...ఎలా అంటే..

Published : Aug 21, 2018, 02:49 PM ISTUpdated : Sep 09, 2018, 01:41 PM IST
చంద్రబాబు అండ్ కో 4లక్షల కోట్లు దోచుకున్నారు...ఎలా అంటే..

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిలువునా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువతను నిత్యం మోసం చేస్తూనే ఉన్నారన్నారు. 

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిలువునా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువతను నిత్యం మోసం చేస్తూనే ఉన్నారన్నారు. 

కుట్రలు, మోసాలు, అబద్దాలతో చంద్రబాబు పాలన చేస్తున్నారని నాలుగేళ్లలో 1.50వేల కోట్ల రూపాయలు అప్పలు చేశారన్నారు. విదేశీ పెట్టుబడుల విషయంలోనూ అసత్యాలు చెప్తున్నారని దుయ్యబుట్టారు. చంద్రబాబు అండ్ కో 4 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. 

రాష్ట్రంలో 80శాతం మంది ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్ మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. ఇకపోతే  రాష్ట్ర జీడీపీ పెరిగిపోతుందని హడావిడి చేస్తున్నారని, నాబార్డు నివేదికను చూస్తే బాబు పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. నాబార్డు నివేదికపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదన్నారు. 

ఏపీలో రైతాంగం సంక్షోభంలో ఉందనే విషయాన్ని నాబార్డు, నీతిఆయోగ్‌ స్పష్టం చేసిందన్నారు. నాబార్డు నివేదికను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భూమన ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ రైతులకు ఉపయోగపడకపోగా... రైతులను వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేలా చేసిందన్నారు.  
 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations