శ్రీకాళహస్తి ఘటనపై విచారణకు కమిటీ: తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 17, 2023, 5:14 PM IST

శ్రీకాళహస్తిలో జనసేన నేతపై  సీఐ అంజుయాదవ్ దాడి చేసిన ఘటనపై  విచారణకు కమిటీని ఏర్పాటు  చేస్తామని  ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చెప్పారు.


తిరుపతి: శ్రీకాళహస్తిలో  జనసేన నేతపై  సీఐ  అంజుయాదవ్ దాడి చేసిన ఘటనపై విచారణకు  కమిటీని ఏర్పాటు  చేయనున్నట్టుగా తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి  చెప్పారు.ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా సీఐ అంజుయాదవ్ పై  చర్యలు తీసుకుంటామన్నారు.

జనసేన నేతపై  సీఐ అంజుయాదవ్  దాడికి దిగారు.  ఈ దాడి ఘటనపై  తిరుపతి ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  సోమవారంనాడు వినపతి పత్రం సమర్పించారు.   సీఐపై  చర్యలు తీసుకోవాలని  కోరారు.  పవన్ కళ్యాణ్  వెళ్లిపోయిన తర్వాత  తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి ఘటనపై తాము ఇచ్చిన సమాధానంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  సంతృప్తి చెందారని ఆయన  అభిప్రాయపడ్డారు. సీఎం దిష్టిబొమ్మ దహనం సమయంలో గలాటా జరిగిందన్నారు. ఈ విషయమై సీఐకి చార్జ్ మెమో ఇవ్వలేదన్నారు.  ఈ ఘటనపై  హెచ్ఆర్‌సీ నోటీసులకు సమాధానం ఇస్తామని  ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డి  చెప్పారు.ఈ విషయమై  హెచ్ఆర్‌సీ ఇచ్చిన నోటీసులకు కూడ సమాధానం చెబుతామని  ఎస్పీ వివరించారు.

Latest Videos

undefined

ఈ నెల  12న  శ్రీకాళహస్తిలో  సీఐ అంజుయాదవ్ జనసే నేత సాయిపై  చేయి చేసుకున్నారు.   ఈ ఘటనపై జనసేన సీరియస్ గా తీసుకుంది. సీఐ అంజుయాదవ్ పై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్  చేసింది. 

also read:పోలీసులను ఇష్టానురాజ్యంగా వాడొద్దు.. ప్రాథమిక హక్కులనే కాలరాస్తే ఎలా?: పవన్ కల్యాణ్

వాలంటీర్లపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను  నిరసిస్తూ  వైఎస్ఆర్‌సీపీ ఆందోళనలు నిర్వహిస్తుంది.  వైఎస్ఆర్‌సీపీకి కౌంటర్ గా  జనసేన కూడ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే  జనసేన నేతలను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. అయితే   పోలీస్ స్టేషన్ లో  నిరసనకు దిగిన జనసేన నేత సాయిపై  సీఐ అంజుయాదవ్ చేయిచేసుకోవడం  సంచలనంగా మారింది. గతంలో కూడ  అంజు యాదవ్ పై పలు ఆరోపణలు వచ్చాయని  జనసేన నేతలు గుర్తు  చేస్తున్నారు.


 

 

 

click me!