అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడకి తరలింపు

By Siva KodatiFirst Published Jan 6, 2021, 8:23 PM IST
Highlights

హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సికింద్రాబాద్ జడ్జి క్వార్టర్స్‌లో ఆమెను హాజరుపరిచారు.

హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సికింద్రాబాద్ జడ్జి క్వార్టర్స్‌లో ఆమెను హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు ఆమెకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అఖిల ప్రియను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించనున్నారు.

కాగా, ఈ కేసులో కేసులో అఖిల ప్రియను బుధవారం హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు సంబంధించి అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్ పరారీలో ఉండగా‌, ఆయన సోదరుడు చంద్రబోసును అదుపులోకి తీసుకున్నారు.

ఈ కిడ్నాప్ కేసులో ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్ అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరించారు. మరోవైపు తనను ఈ కేసులో ఏ 1 నిందితుడిగా చేర్చడంపై ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు.

Also Read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

కిడ్నాప్ కేసులో తనను ఎందుకు నిందితుడిగా చేర్చారో అర్ధం కావడం లేదన్నారు. కిడ్నాప్‌తో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసుతో సంబంధం ఉంటే తనను ఇప్పటికే అరెస్ట్ చేసేవాళ్లని సుబ్బారెడ్డి తెలిపారు.

కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్ రావుతో విబేధాలు వున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అఖిలప్రియ తనను చంపడానికి సుఫారి ఇచ్చిందని గతంలోనే కేసు పెట్టానని.. అలాంటి వారితో తానెందుకు కలిసి కిడ్నాప్ చేస్తానని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. హఫీజ్ పేట భూ వివాదంపై ఇప్పుడు మాట్లాడలేనన్నారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఏవీ సుబ్బారెడ్డి వున్నారు. 

click me!