పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అఫైర్ వ్యాఖ్యలు.. నాలుక కరుచుకుని...

By AN Telugu  |  First Published Oct 8, 2021, 8:44 AM IST

YSR Aasara scheme లబ్దిదారులైన మహిళలకు పథకాన్ని పంపిణీ చేసే ఓ కార్యక్రమంలో mla grandhi srinivas పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు మహిళల మీద గౌరవం లేదని అన్నారు. దేనికైనా జనసేన అనుచరులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.


కాకినాడ : భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గురువారం జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. pawan kalyan ఒక నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో... వెంటనే సర్దుకున్నారు.. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని విలేకరులకు తెలిపాడు. 

YSR Aasara scheme లబ్దిదారులైన మహిళలకు పథకాన్ని పంపిణీ చేసే ఓ కార్యక్రమంలో mla grandhi srinivas పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు మహిళల మీద గౌరవం లేదని అన్నారు. దేనికైనా జనసేన అనుచరులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

Latest Videos

వైఎస్‌ఆర్‌సిని అంతం చేయాలని, యువతYCPకి తగిన గుణపాఠం నేర్పాలని రెచ్చగొడుతున్నారన్నారు. ఈ ప్రయత్నంలో తను చనిపోతే పవన్ నా  అస్థికలు దేశమంతటా చల్లాలని మాట్లాడుతున్నారన్నారు. ఇటువంటి ప్రకటనలు యువతను తప్పుదోవ పట్టిస్తాయని, వారిని సామాజిక వ్యతిరేకులుగా మారుస్తాయని శ్రీనివాస్ ఆరోపించారు.

ఆయన అస్తికలు దేశమంతటా చల్లడానికి.. పవన్ కల్యాణ్ అంత ఘనకార్యాలు ఏం చేశారని ఎద్దేవా చేశారు. అంతేకాదు janasena అధినేత వల్ల సమాజానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. శ్రమదానం పేరుతో పవన్ నాటకాలాడుతున్నారని.. రాజమహేంద్రవరం పర్యటనలో, పవన్ కళ్యాణ్ మట్టితట్ట పట్టుకుని పోస్తున్నట్టు కెమెరాలకు ఫోజులిచ్చాడన్నారు. ఫొటోలకు పోజులివ్వడం అయిపోగానే అక్కడి నుండి వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు.

కారుపైకి ఎక్కి పోలీసులకు పవన్ వార్నింగ్.. శ్రమదానం కార్యక్రమంలో హైడ్రామా

అయినా ఏపీ ముఖ్యమంత్రి ys jagan పవన్ కళ్యాణ్ విమర్శలకు స్పందించడం ఎప్పుడో మానేశారన్నారు. అన్నమాట మీద నిలబడే... మాట మార్చని మడమతిప్పని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను యువత నమ్మాలన్నారు. జనసేనలో చేరేబదులు అధికార పార్టీలో చేరాలని యువతకు పిలుపునిచ్చారు. వైసీపీలోనే మంచి భవిష్యత్తుకు ఉందన్నారు.

కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2న, గాంధీ జయంతి పురస్కరించుకుని రాజమండ్రిలో శ్రమదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ పోలీసులుపై నిప్పులు చెరిగారు. కారుపైకి ఎక్కి వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. తమ కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. వైసీపీకి హెచ్చరికలు చేశారు. పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయపరిణతి ఉన్న వ్యక్తి కాదని విమర్శించారు. దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి గెలవాలన్నారు. ఇప్పటికే ఘోరంగా పరాజయం పాలైనప్పటికీ ముఖ్యమంత్రినే విమర్శించడమేంటని అడిగారు. ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. 
 

click me!