ఏపీ : 24 గంటల్లో 643 మందికి పాజిటివ్... 20,52,411కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Oct 07, 2021, 09:09 PM ISTUpdated : Oct 07, 2021, 09:11 PM IST
ఏపీ : 24 గంటల్లో 643 మందికి పాజిటివ్... 20,52,411కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 643 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 839 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 8,550 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు (corona cases in ap) మరోసారి 1000లోపే నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 643 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,52,411కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,236కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరు 1, కృష్ణ 2, ప్రకాశం 3, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 839 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,29,625 చేరింది. గత 24 గంటల వ్యవధిలో 48,028 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,86,12,576కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 8,550 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 23, చిత్తూరు 145, తూర్పుగోదావరి 84, గుంటూరు 81, కడప 15, కృష్ణ 74, కర్నూలు 3, నెల్లూరు 69, ప్రకాశం 60, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 46, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 20 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్