గన్‌‌తో తిరిగిందెవరు, నీతో ప్రాణహాని అని శ్రీజ చెప్పలేదా : పవన్‌ రౌడీయిజం వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్ కౌంటర్

Siva Kodati |  
Published : Jun 27, 2023, 02:31 PM IST
గన్‌‌తో తిరిగిందెవరు, నీతో ప్రాణహాని అని శ్రీజ చెప్పలేదా : పవన్‌ రౌడీయిజం వ్యాఖ్యలపై గ్రంథి శ్రీనివాస్ కౌంటర్

సారాంశం

వైసీపీ నేతలు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. జీవిత , రాజశేఖర్‌లపై రౌడీయిజం చేసిందెవరో ప్రజలకు గుర్తుందన్నారు. 

వైసీపీ నేతలు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి, కాపులను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముందు పార్టీ గుర్తును కాపాడుకోవడంపై పవన్ కల్యాణ్ శ్రద్ధ పెట్టాలని గ్రంథి శ్రీనివాస్ చురకలంటించారు. భీమవరం నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు వుంటారు.. ఎన్నికలు ఎలా జరుగుతాయి లాంటి విషయాలు కూడా పవన్‌కు తెలియవని ఆయన చురకలంటించారు. సినిమా ఆర్టిస్టులకు జనాల్లో ఆదరణ వుండటం కామన్ అన్న శ్రీనివాస్.. అనసూయ రాజమండ్రి వచ్చిన జనం కిటకిటలాడతారని సెటైర్లు వేశారు. 

గోదావరి జిల్లాల్లో రౌడీయిజం చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలపైనా గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన బాబాయ్ పవన్ వల్ల ప్రాణహాని వుందని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని , రౌడీల వ్యవహరించిన ఘటనను జనం మరిచిపోలేదన్నారు. జీవిత , రాజశేఖర్‌లపై రౌడీయిజం చేసిందెవరో ప్రజలకు గుర్తుందన్నారు. మక్కలు ఇరగదీయడం, పీక నొక్కేయడం, గుడ్డలు ఊడదీసి కొట్టడం ఇవే పవన్ మేనిఫెస్టో అన్నారు. పవన్‌కు విశ్వసనీయత లేదని..  2019లోనే ప్రజలు గోదావరి జిల్లాలకు జనసేన విముక్తి కలిగించారని గ్రంథి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. భీమవరంలో ఓడిపోయాక.. మళ్లీ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.

ALso Read: నా ప్రాణాలు పోవచ్చు.. జగన్‌పై నాకేం కక్ష లేదు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఇక నిన్న నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు కోసం పోరాడుతున్నానని.. ఈ పోరాటంలో తన ప్రాణాలు పోవచ్చన్నారు. ఎంతమందికి జగన్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి పోతున్నాయని.. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారని పవన్ దుయ్యబట్టారు. సీఎంగా వున్న వ్యక్తి ఎలాంటి త్యాగాలు చేయలేదన్నారు. అన్యాయంపై ఎదురు తిరగాలని మనకు పాఠశాలల్లో నేర్పించారని పవన్ పేర్కొన్నారు. సహజవనరులను కొందరు నేతలు కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కనీస వసతులు అందరికీ అందాలని , అది ప్రాథమిక హక్కని పవన్ పేర్కొన్నారు. ప్రాథమిక సౌకర్యాలు లేకుంటే ప్రజలు ఉద్యమం చేస్తారని జనసేనాని హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu