ఏపీ మంత్రిపై తేనెటీగల దాడి: పరుగులు పెట్టిన వైసీపీ నేతలు

Published : Nov 29, 2019, 12:46 PM IST
ఏపీ మంత్రిపై తేనెటీగల దాడి: పరుగులు పెట్టిన వైసీపీ నేతలు

సారాంశం

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే వైసీపీ నాయకుల అలజడితో అక్కడే ఉన్న తేనేపట్టు ఒక్కసారిగా కదిలింది. 

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ నీటి పారదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాములపాడు మండలంలోని బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను పరిశీలించేందుకు వెళ్లారు. 

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే వైసీపీ నాయకుల అలజడితో అక్కడే ఉన్న తేనేపట్టు ఒక్కసారిగా కదిలింది. 

అక్కడకు వచ్చిన వారిపై దాడికి పాల్పడింది. అయితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారులోనే ఉండటంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే పలువురు వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డాయి. 

అయితే తేనెటీగల దాడిలో గాయపడ్డ మీడియా ప్రతినిధులు, వైసీపీ నేతలకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న అధికారులు గానీ ఇతర సిబ్బందిగానీ ఈ విషయాన్ని గమనించకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

New Year Celebrations: కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు | Asianet News Telugu
వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నసూర్యకుమార్ యాదవ్ దంపతులు | Asianet News Telugu