తాగి ఇంటిపైకి...రోడ్డుపై పోతుంటేకూడా...: బిసి జనార్ధన్ రెడ్డి భార్య ఆందోళన

By Arun Kumar PFirst Published May 26, 2021, 1:20 PM IST
Highlights

వేధింపుల్లో భాగంగానే తన భర్త బిసి జనార్ధన్ రెడ్డిని అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని బిసి ఇందిరా రెడ్డి ఆరోపించారు. 

కర్నూలు జిల్లాలో తన భర్తకు ఉన్నంత ఒత్తిడి, వేధింపులు మరెవరికీ లేవని బిసి జనార్థన్ రెడ్డికి సతీమణి ఇందిరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తన భర్తపై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి కష్ట సమయంలో తనభర్త, కుటుంబానికి అండగా నిలవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని ఇదిరారెడ్డి అన్నారు. 

''ఇదివరకు కూడా రెండు, మూడుసార్లు కొందరు తాగి ఇంటిపైకి వచ్చి మా వాళ్లతో గొడవపడ్డారు. రోడ్డుపై పోతూకూడా మా మనుషులను ఏదో ఒకటి అనేవారు. కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి స్నేహితుడైన దుర్గాప్రసాద్ కావాలనే ప్రతిసారీ రెచ్చగొట్టేవాడు'' అని ఇందిరారెడ్డి ఆరోపించారు. 

read more బిసి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ సుప్రీంకోర్టుకు..: చంద్రబాబు వెల్లడి

''రామిరెడ్డి కొడుకుని కట్టడిచేయకుండా, ప్రతిపక్షనేతలపై కేసులతో ఆనందపడుతున్నాడు. అధికారపార్టీ వారి భూ ఆక్రమణలు, అక్రమ లేఅవుట్లను జనార్థన్ రెడ్డి అనేకసార్లు అడ్డుకున్నారు. అది బాగా మనసులో పెట్టుకొని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు'' అని తెలిపారు.

''జరిగిన ఘటనలపై అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా వారు కేసు నమోదు చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికలో పనిచేశారనిచెప్పి శిల్పా కుటుంబీకులు కూడా జనార్థన్ రెడ్డిపై కక్షకట్టారు'' అని ఇందిరారెడ్డి తెలిపారు.

click me!