చాయ్ వాలాగా మారిన బాపట్ల వైసిపి ఎంపీ

Published : Jun 04, 2019, 04:49 PM ISTUpdated : Jun 04, 2019, 05:08 PM IST
చాయ్ వాలాగా మారిన బాపట్ల వైసిపి ఎంపీ

సారాంశం

బాపట్లలోని ఓ గ్రామంలో పర్యటిస్తున్న ఎంపీ నందిగం సురేష్ ఒక్కసారిగా ఛాయ్ వాలా అవతారం ఎత్తారు. ఒక కిరణా షాపులోకి వెళ్లిన ఆయన వారందరితో సరదాగా ముచ్చటించారు. అనంతరం కార్యకర్తలకు బిస్కెట్లు అమ్మారు. అనంతరం ఛాయ్ కూడా అమ్మారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

బాపట్ల: ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతుంటారు. అంతేకాదు చేయని ఫీట్లు కూడా చేస్తారు. ఒకరు ఐరన్ చేస్తే మరోకరు కటింగ్ వేస్తారు. ఇంకొకరు దోసెలు వేస్తే, మరికొందరు ఛాయ్ పెడతారు.   

ఇలా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే గెలిచిన తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తే వారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బాపట్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్. 

ఎంపీగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పలు పర్యటనల్లో పాల్గొన్నారు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఎంపీ నందిగం సురేష్. 

బాపట్లలోని ఓ గ్రామంలో పర్యటిస్తున్న ఎంపీ నందిగం సురేష్ ఒక్కసారిగా ఛాయ్ వాలా అవతారం ఎత్తారు. ఒక కిరణా షాపులోకి వెళ్లిన ఆయన వారందరితో సరదాగా ముచ్చటించారు. అనంతరం కార్యకర్తలకు బిస్కెట్లు అమ్మారు. 

అనంతరం ఛాయ్ కూడా అమ్మారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే తాను అందరివాడినని, మీతోనే ఉంటానని తనను ఎప్పటి సురేష్ లాగేనే చూడాలంటూ ప్రజలకు చెప్పుకొచ్చారు ఎంపీ నందిగం సురేష్.   

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu