చట్టానికి ఎవరూ అతీతులు కాదు .. చంద్రబాబు అరెస్టుపై బండి సంజయ్ రియాక్షన్  

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. 

Google News Follow Us

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుపై బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని తెలిపారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే ముఖ్యమంత్రిగా సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను  అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమంజం కాదని అన్నారు.

చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని , చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. 

Read more Articles on