అరకులో బొంగు చికెన్ ఇక దొరకదా..?

First Published Jun 11, 2018, 2:02 PM IST
Highlights

అరకులో బొంగు చికెన్ ఇక దొరకదా..?


అరకు వెళ్లే వారిని ప్రకృతి అందాలతో పాటు మరో ప్రత్యేకమైన వంటకం ఆకర్షిస్తుంది.. అదే బొంగు చికెన్.. వాడుకలో ఉన్న విధంగా పాత్రల్లో చికెన్ వండకుండా.. మాంసానికి ఉప్పు, కారం దట్టించి దానిని వెదురు బొంగులో కూరి మంటపై ఉడికించి వేడివేడిగా పర్యాటకులకు వడ్డిస్తారు అక్కడి  గిరిజనులు.. అక్కడికి వెళ్లివచ్చిన జనాలు తమ స్నేహితులతో యాత్రా విశేషాలను చెప్పుకునే సమయంలో ఖచ్చితంగా బొంగు చికెన్ విషయాన్ని ప్రస్తావిస్తారు. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న బొంగు చికెన్‌ తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇందుకు కారణం అటవీ శాఖ నిర్ణయమే..

బొంగు చికెన్ తయారీ కోసం వెదురు బొంగులను నరికి తీసుకువచ్చి.. దానిలో చికెన్ వండుతారు. అయితే ఇలా చేయడం వల్ల చెట్లు నాశనం అవుతున్నాయని.. పర్యావరణానికి హానీ కలుగుతుందని .. ప్రకృతి పరీరక్షణ దృష్ట్యా బొంగు చికెన్‌పై నిషేధం విధిస్తున్నాని... దీనిని మీరి ఎవరైనా వెదురు బొంగులు నరికి తెచ్చి చికెన్ వండితే.. వారిపై కేసులు పెడతామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. ఒకవేళ బొంగు చికెన్ తయారు చేయాలనుకుంటే.. ఒక్కొక్క షాపు యజమాని నెలకు రూ.2500 అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బొంగు చికెన్ తయారు చేసే వారు షాపులను మూసివేశారు.. దీని ప్రభావం 35 కుటుంబాలపై పడి వారు ఉపాధిని కోల్పోయే పరిస్ధితి నెలకొంది. ఆదివారం కూడా మారేడు మిల్లిని సందర్శించిన పర్యాటకలు బొంగు చికెన్ కోసం వెతగ్గా.. ఎక్కడా లభించకపోవడంతో.. ఆరా తీయగా ప్రభుత్వ నిషేధం గురించి తెలుసుకుని  నిరాశతో వెనుదిరిగారు. 
 

click me!