ఏపీ రాజధానిపై బాలకృష్ణ బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. అఖండ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై కూడా ఆయన తొలిసారిగా వ్యాఖ్యానించారు.
అమరావతి: ఏపీలో సరైన రాజధాని దిక్కులేని రాష్ట్రంలో ఉన్నామని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే BalaKrishna చెప్పారు. అఖండ సినిమా సక్సెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
2014లో ఉమ్మడి రాష్ట్రం విజభన జరిగిన సమయంలో ఏపీ రాష్ట్రానికి రాజధాని లేదు. తెలంగాణకు hyderabad రాజధానిగా ఉంది. అయితే అప్పట్లో chandrababu ఏపీ సీఎంగా ఉన్న సమయంలో Amaravatiని రాజధానిగా నిర్ణయం తీసుకొన్నారు. Capital నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం సుమారు 35 వేల ఎకరాల భూమని సేకరించింది. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భవనాల నిర్మాణాలను చేపట్టింది.
undefined
ఏపీ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో Tdp అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారాన్ని చేపట్టింది. దీంతో మూడు రాజధానుల అంశాన్నిYcp సర్కార్ ముందుకు తీసుకొచ్చింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేస్తామని Ys Jagan సర్కార్ ప్రతిపాదించింది..ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొంది. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. మరో వైపు మూడు రాజధానులపై న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేలా కొత్త చట్టాన్ని ఏపీ సర్కార్ తీసుకు రానుంది.
ఏపీ రాష్ట్రంలో Cinema Ticket ధరల తగ్గింపు అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలోనే బాలకృష్ణ స్పందించారు. సినీ పరిశ్రమలోని పెద్దలంతా కలిసి ఈ విషయమై ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ సమస్యలను చెబుతామంటే వినే నాథుడెవరున్నారని బాలకృష్ణ ప్రశ్నించారు.
తెలుగు సినీ పరిశ్రమకి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు ఉండాలని ఆయన కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్దిల్లాలి ఆయన ఆకాంక్షించారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా ఉండదని వ్యాఖ్యానించారు. పెద్ద సినిమా ఫెయిల్ అయితే దాన్ని చిన్న సినిమా కూడా అనరని అన్నారు. కానీ చిన్న సినిమా హిట్ అయితే దానిని పెద్ద సినిమా అంటారని చెప్పారు.
సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించాలన్నారు.టికెట్లతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. సినిమా బాగుండాలనేదే తన కోరిక అని చెప్పారు. విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోవడం తన డిక్షనరీలో లేదని చెప్పారు.
ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సినిమా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయాన్ని సినీ పరిశ్రమ పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. సినిమా టికెట్ ధరలను పెంచాలని కోరుతున్నారు. మరో వైపు సామాన్యులకు న్యాయం చేసేందుకే తాము సినిమా టికెట్ ధరలను తగ్గించామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఈ విషయమై రామ్‌గోపాల్ వర్మ ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. తన వాదనలను ప్రభుత్వం ముందుంచారు.