వివేకా హత్య కేసులో నిందితులకు బెయిల్

By telugu teamFirst Published Jun 28, 2019, 7:28 AM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ముగ్గురికి పులివెందల సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
 
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ముగ్గురికి పులివెందల సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైస్ వివేకా... ఎన్నికల ముందు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా..హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకా్‌షను పోలీసులు అరెస్టుచేసి మార్చి 28న రిమాండ్‌కు తరలించారు. 

అప్పటి నుంచి వీరు బెయిల్‌కోసం మూడుసార్లు కోర్టు గుమ్మం ఎక్కారు. రెండుసార్లు జిల్లా కోర్టులో, ఒకసారి హైకోర్టులో వీరి బెయిల్‌ వినతిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో, రిమాండ్‌కు వెళ్లి 90 రోజులు గడిచినా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ పూర్తి కానందున చార్జిషీట్‌ వేయకపోవడంతో కోర్టు వీరికి ఎలాంటి షరతులు లేకుండా గురువారం బెయిల్‌ మంజూరు చేసింది.

click me!