విజయవాడలో కలకలం... కాలేజికని వెళ్లిన బిటెక్ విద్యార్థిని మిస్సింగ్

Arun Kumar P   | Asianet News
Published : May 06, 2022, 04:58 PM ISTUpdated : May 06, 2022, 05:13 PM IST
విజయవాడలో కలకలం... కాలేజికని వెళ్లిన బిటెక్ విద్యార్థిని మిస్సింగ్

సారాంశం

ఓవైపు వరుసగా మహిళలపై అఘాయిత్యాలు వెెలుగుచూస్తున్న సమయంలో విజయవాడలో ఓ కాలేజీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న సమయంలో కృష్ణా జిల్లాలో ఓ యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. కాలేజికని వెళ్లిన యువతి ఇంటికి తిరిగిరాకపోవవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

వివరాల్లోకి వెళితే... విజయవాడ నారాయణపురంకి చెందిన వెన్నలకంటి తనూజ(21) ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయల్ చదవుతుంది. గురువారం ఉదయం కాలేజీ ఫీజు కట్టేందుకు వెళుతున్నానని చెప్పి ఇంట్లోకి బయటకు వెళ్ళింది. సాయంత్రమైన యువతి ఇంటికిరాకపోవడంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యలు ఆమె స్నేహితులతో పాటు బంధువులను ఆరా తీసారు. ఎక్కడా ఆఛూకీ లభించకపోయేసరికి అత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. 

యువతి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  తనూజ సెల్ ఫోన్ సిగ్నల్ ఆదారంగా హైదరాబాద్ లో వెళ్లినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ వెళ్లగానే ఆమె సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవడంతో ఏమయ్యిందన్నది తెలియడంలేదని పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, శ్రీసత్యసాయి జిల్లాలో యువతి అనుమానాస్పద మృతితో రాష్ట్రంలో మరోసారి మహిళన భద్రతపై ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యువతిపై, రేపల్లెలో వివాహితపై సామూహిక అత్యాచారం, తమ్మపూడిలో మహిళ దారుణ హత్య తదితర ఘటనలతో మహిళలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది.  

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లపై వారి ఇంటిపక్క యువకుడే కన్నేసాడు.  కామంతో కళ్ళు మూసుకుపోయిన యువకుడు అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత అర్ధరాత్రి 2 గంటల సమయలో బాలికలిద్దరూ బహిర్భూమికి వెళ్ళగా ఇదే అదునుగా రహస్యంగా వారిని అనుసరించిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరిలో చిన్నదైన ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.   

ఇక శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన యువకుడి తోటలో యువతి తీవ్ర గాయాలతో మృతిచెందడం కలకలం రేపింది. అయితే యువతిది ఆత్మహత్య కాదని... గ్యాంగ్ రేప్ చేసి చంపారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.  గోరంట్లకు చెందిన యువతి తిరుపతిలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఈమె గోర్లంట్లలో అద్దెకుండే ఇంటికి సమీపంలో సాదిక్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసి యువతి తల్లిదండ్రులు ఇంటిని ఖాళీచేసి మరో చోట అద్దెకున్నారు.  అయినప్పటికి యువతితో సాదిక్ ప్రేమాయణం కొనసాగుతూనే వుంది. 

ఏమయ్యిందో తెలీదుగానీ తిరుపతిలో వుండాల్సిన యువతి ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ లో శవంగా తేలింది. శరీరంపై గాయాలతో ఓ షెడ్ లో ఉరేసుకుని యువతి మృతదేహం లభించింది. యువతిని  తిరుపతినుండి తీసుకువచ్చి సాదిక్ తో పాటు అతడి  స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి చనిపోయాక ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని  అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
 

 

 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?