జగన్ గారు మరో తుగ్లక్ నిర్ణయం.. ‘అతన్నలా వదిలేయకమ్మా.. ఎక్కడైనా చూపించమ్మా..’ : అయ్యన్నపాత్రుడు వినతి...

By SumaBala BukkaFirst Published Jan 22, 2022, 12:46 PM IST
Highlights

ఇప్పటికే నీ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, సర్వనాశనం చేసేసారు...రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజిలు 7,880 కోట్లతో కడతాడని అనౌన్స్ చేసి, క్రిందటి సంవత్సరం మే 30 వ తేదీన 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆ కాలేజిలు ఏమయ్యాయి ? ఎంప్లాయ్స్ కి, పెన్షన్ దారులకు టైంకి డబ్బులు చెల్లించలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. 

విశాఖ పట్నం : ముఖ్యమంత్రి Jagan Reddyగారు మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు అంటూ మాజీమంత్రి చింతకాయల ayyannapatrudu వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రతీ జిల్లాకి ఒక airport కట్టాలి, దానికోసం ప్రతిపాదనలు సిద్దం చేయండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు అంటూ.. ‘ఏంటండి ఈ తుగ్లక్ నిర్ణయాలు..’ అని ప్రశ్నించారు. 

ఇప్పటికే నీ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, సర్వనాశనం చేసేసారు...రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజిలు 7,880 కోట్లతో కడతాడని అనౌన్స్ చేసి, క్రిందటి సంవత్సరం మే 30 వ తేదీన 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆ కాలేజిలు ఏమయ్యాయి ? ఎంప్లాయ్స్ కి, పెన్షన్ దారులకు టైంకి డబ్బులు చెల్లించలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. 

అలాగే రిటైర్ అయిన ఎంప్లాయ్స్ కి ఆరు నెలల నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నావు. నువ్వు, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..? అంటూ దుయ్యబట్టారు. మన రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడానికి డబ్బులు లేవు, ఉత్తరాంద్ర సుజల స్రవంతి ప్రాజక్టు కట్టడానికి డబ్బుల్లేవు కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..? అని ప్రశ్నించారు.

విజయనగరంలో ట్రైబుల్ యూనివర్సి కట్టలేకపోయావు, కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..? కరోనా సెకండ్ వేవ్ టైంలో క్వారంటైన్ సెంటర్లలో బోజనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకి కోట్ల రూపాయలు పేమెంట్లు చెల్లించ లేదు,  కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..? గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు మధ్యాహ్న బోజనాలు పెడతున్న కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు. కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా...?

R&B, నీరు-చెట్టు, NREGS పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించ లేదు. కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..?, కోట్ల రూపాయలు హౌసింగ్ బిల్లులు చెల్లించలేదు, టిట్కో హౌసింగ్ పూర్తి చెయ్యలేదు. కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..? రైతులు దగ్గర కొన్న దాన్యానికి ప్రబుత్వం ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వలేదు, రైతులకు ఇవ్వవలసిన చెరుకు బకాయిలు చెల్లించలేదు. కానీ, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..?

ఆఖరికి, కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కుడా పరిహారం కూడా చెల్లించలేకపోయావు’ నువ్వు, జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావా..? సంపద సృష్టించడం చేతకాక, OTS పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్ళు చేస్తూ డబ్బులు దండుకుంటున్నావు. ఆఖరికి చెత్త మీద, డ్రైనేజి మీద పన్నులు వసూలుచేస్తున్నావు. అయినా జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతావని చెప్పడానికి సిగ్గు లేదా ...? అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తూ ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు అయ్యన్నపాత్రుడు.

అమ్మా ! భారతమ్మ ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకీ ఏదో అయిందని అనుమానంగా ఉంది.
ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాదులో గానీ, విశాఖపట్నంలో గాని హాస్పిటల్లో చూపించండి అమ్మా...!  లేదంటే, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతున్నారు.. అంటూ వ్యాఖ్యానించారు. 

click me!