పందిమాంసం సప్లయర్ రాజారెడ్డి అలాగే చచ్చాడా?: అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

Arun Kumar P   | Asianet News
Published : Feb 04, 2021, 11:24 AM IST
పందిమాంసం సప్లయర్ రాజారెడ్డి అలాగే చచ్చాడా?: అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైసిపి నాయకులకు సోషల్ మీడియా వేదికన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.   

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఇటీవల కొందరు దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల కోసం పట్టాభి తనపై తానే దాడిచేయించుకుని అధికార పార్టీ, ప్రభుత్వం నిందలు మోపుతున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వైసిపి నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. 

''హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్లలో తిరగటానికి 16 నెలల్లో రూ.26 కోట్లా? అదీ ప్రజాధనం? పోనీ పీకింది ఏమైనా ఉందా అంటే చీకట్లో ఢిల్లీ వెళ్ళటం, జైలుకి పోకుండా వేడుకోలు, జడ్జీల మీద ఫిర్యాదులు, కోర్టు ముందు హాజరు,పెళ్ళిళ్ళు,పేరంటాలు.. ప్రజల కోసం ఈ రూ.26 కోట్లతో మీరు పీకింది ఏంటి వైఎస్ జగన్'' అంటూ ట్విట్టర్ వేదికన నిలదీశారు.

read more  ఆ విగ్రహాల జోలికొస్తే... అంతుచూసేవరకు నిద్రపోం: వైసిపి ప్రభుత్వానికి ఉమ స్ట్రాంగ్ వార్నింగ్
 
''అధికారంలో ఉండి కూడా ఆధారాలు లేకుండా, ఇలా గాలి ఏడుపులు ఏడుస్తారు కాబట్టే మిమ్మల్ని గాలి మంద, ఫేక్ మంద అనేది. పావురాలగుట్టలో పావురం అయినోడు తన హెలికాప్టర్ తానే పేల్చుకున్నాడా? వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, కోడికత్తితో గుచ్చుకుని "అమ్మా అంటూ బిగ్గరగా కేక వేసిన జగన్" అని ఆడిన డ్రామాల సంగతి?'' అని ఎద్దేవా చేశారు.

''పట్టాభి తన మీద తానే దాడి చేసుకున్నారని బులుగు గొర్రెలు మొరుగుతున్నాయి. ముఖ్యంగా గుడివాడ గొర్రె, గన్నవరం గొర్రెల డాక్టర్. మరి కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్, బలపనూరులో బడి గంటలు కొడుతూ, బ్రీటీష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేసిన రాజా రెడ్డి, తన మీద తానే బాంబు వేసుకుని పోయాడా?'' అంటూ జగన్ కుటుంబంపై అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Chandrababu: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు
CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu