ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు. హై కోర్టు ఇచ్చిన తీర్పు నియంత జగన్ కు చెంపపెట్టు వంటిదని అభిప్రాయపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు. హై కోర్టు ఇచ్చిన తీర్పు నియంత జగన్ కు చెంపపెట్టు వంటిదని అభిప్రాయపడ్డాడు.
న్యాయం, ధర్మాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, తాజాగా హై కోర్టు రమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పుతో నియంత అయిన జగన్ చెంపచెల్లుమందని అన్నారు అయ్యన.
ఇకనైనా జగన్ బుద్ధి తెచ్చుకుని కళ్లుతెరిచి మంచి పరిపాలన చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం జారీ చేసిన దస్త్రంపై గవర్నర్ కళ్లుమూసుకుని సంతకం చేశారని, రానున్న రోజుల్లో అయినా గవర్నర్ దస్త్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు పునరాలోచన చేయాలని అన్నారు అయ్యన.
undefined
రాష్ట్రాన్ని పాలించటం జైళ్లో ఉన్నంత తేలిక కాదన్న విషయం జగన్ గ్రహించాలని, కక్షసాధింపులు ఇకనైనా మాని దౌర్జన్యాలు వీడి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తే అందరికీ మంచిదన్నారు అయ్యన.
ఇప్పటికైనా ఆప్తులైన సుబ్బారెడ్డి, ఏ2 విజయసాయి రెడ్డిల ఆగడాలు మితిమీరాయని జగన్ గ్రహించాలని, వీరిద్దరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని తెలిసి కూడా మాట్లాడటంలేదంటే జగన్ ప్రోత్సాహం వీరి వెనుక ఉందని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.
ఇకపోతే... వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఏకకాలంలో 10,641 భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభించారు. అలాగే సీఎం యాప్ ను కూడా ప్రారంభించారు. ఏపీలోని రైతులకు ఇక ఈ భరోసా కేంద్రాల నుంచే సేవలు అందనుండగా, సీఎం యాప్ ద్వారానే రైతులకు నగదు చెల్లింపులు జరపనున్నారు.
రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించి విజ్ఙానాన్ని అందించేవిగా రైతు భరోసా కేంద్రాలు మారనున్నాయి. అంతేకాకుండా ఇంటిగ్రేటెట్ కాల్ సెంటర్(ఫోన్ నెంబర్ 155251) ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను ఈ భరోసా కేంద్రాల ద్వారానే అందించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.
''ఎన్నికల సమయంలో రెండు పేజీల మేనిపెస్టోను విడుదల చేశాం. అదే ఇప్పటికీ మాకు ఖురాన్, బైబిల్, భగవద్గీత. కేవలం ఏడాది కాలంలోనే 90శాతం వాగ్దానాలు అమలుచేసే దిశగా అడుగులు వేశాం. ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఈ మేనిఫెస్టో కనిపిస్తుంది'' అని తెలిపారు.
''వైఎస్ జగన్ అనే నేను మీ కుటుంబ సభ్యుడిగా మీకిచ్చిన మాటలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నానని అదే ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అని అన్నారు.