బ్రేకింగ్ న్యూస్...అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

Published : Dec 13, 2019, 03:43 PM IST
బ్రేకింగ్ న్యూస్...అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

సారాంశం

సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ కేసు విచారణను చేపట్టిన సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇవాళ సిబిఐ అధికారులు విజయవాడలో పర్యటించి ఈ కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.

ఆయేషా మీరా హత్య కేసులో ఇప్పటివరకు సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేసింది. అయితే హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరగా...ఆ రికార్డులు విజయవాడ కోర్ట్ లో దగ్దమయ్యాయని తెలిపారు.  దీనిపై సీరియస్ అయిన హైకోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా రికార్డుల దగ్ధం పై కూడా విచారణ చేపట్టాల్సిందిగా సిబిఐకి ఆదేశించడంతో ప్రాథమిక సమాచారాన్ని సేకరించడానికి సిబిఐ అధికారులు విజయవాడకు వెళుతున్నట్లు సమాచారం. 

అయితే సిబిఐ అధికారుల విజయవాడ పర్యటన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం సిబిఐ ఈ కేసుపై ఎప్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.   
 
ఆయేషా మీరా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ కేసును పునర్విచారించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సంబంధించిన రికార్డులన అందించాల్సింది అధికారులను ఆదేశించింది. అయితే ఏడాళ్లుగా ఈ కేసు విచారణ విజయవాడ కోర్టులో కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి అక్కడున్న రికార్డులు దగ్ధమయ్యాయన్న అధికారుల జవాబుపై సీరియస్ అయిన కోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్