కోళ్ల దొంగతనానికి వచ్చిన వ్యక్తిని చితకబాదిన స్థానికులు, మృతి: ఏలూరు పోలీసుల అదుపులో ఇద్దరు

By narsimha lode  |  First Published Sep 18, 2022, 10:45 AM IST

కోళ్ల దొంగతనం కోసం వచ్చిన అవినాష్ అనే వ్యక్తి స్థానికులకు దొరికాడు. దీంతో స్థానికులు అతడిని చెట్టుకు కట్టేసి కొట్టారు.ఈ దెబ్బలు తాళలేక అవినాష్ మృతి చెందాడు. ఈ విషయమై అవినాష్ ను కొట్టిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 


ఏలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో దారుణం చోటు చేసుకుంది. కోళ్ల దొంగతనం కోసం వచ్చిన ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టడంతో  అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులోని ఎంఆర్ అప్పారావు కాలనీలో  మామిడి తోటను సయ్యద్ గయ్యుద్దీన్ అనే వ్యక్తి  లీజుకు తీసుకున్నాడు. ఈ తోటలో కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన దొంగలు కోళ్లను ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశారు. కోళ్లను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన దొంగలను గయ్యుద్దీన్ ప్రయత్నించారు. అయితే ఇద్దరు దొంగలు పారిపోయారు. అవినాష్ అనే వ్యక్తి చిక్కాడుు. దీంతో గయ్యుద్దీన్, అలెగ్జాండర్ లు చెట్టుకు కట్టేసి అవినాష్ ను చితకబాదారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అవినాష్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ అవినాష్ మృతి చెందాడు.  దీంతో సయ్యద్ గయ్యుద్దీన్, అలెగ్జాండర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Latest Videos

click me!