ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న వృద్ధురాలిని కాపాడిన ఆటో డ్రైవర్ కరిముల్లా (వీడియో)

Published : Nov 20, 2021, 04:09 PM IST
ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న వృద్ధురాలిని కాపాడిన ఆటో డ్రైవర్ కరిముల్లా (వీడియో)

సారాంశం

అనుపాలెం గ్రామానికీ చెందిన చల్లా పిచ్చయ్య (70) భార్య చల్లా వెంకటమ్మ పిడుగురాళ్ళలో ఆటో ఎక్కి అనుపాలేం గుడి వద్దకు తీసుకు వెళ్లాలని ఆటో డ్రైవర్ ను కోరింది. auto driver కరిముల్లా ఆ వృద్ధురాలిని అనుపాలెం తీసుకు వెళ్లాడు. అక్కడ ఆటో దిగిన వృద్ధురాలు ఏడుస్తూ దగ్గర్లో ఉన్న  కాలువ మీదుగా వెళ్లడం మొదలు పెట్టింది. 

విజయవాడ : చూసుకునేవారు లేక ఓ వృద్ధురాలు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని సకాలంలో గమనించిన ఆటో డ్రైవర్ ఆమె ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన విజయవాడలోని అనుపాలెం గ్రామంలో జరిగింది. 

"

వివరాల్లోకి వెడితే.. అనుపాలెం గ్రామానికీ చెందిన చల్లా పిచ్చయ్య (70) భార్య చల్లా వెంకటమ్మ పిడుగురాళ్ళలో ఆటో ఎక్కి అనుపాలేం గుడి వద్దకు తీసుకు వెళ్లాలని ఆటో డ్రైవర్ ను కోరింది. auto driver కరిముల్లా ఆ వృద్ధురాలిని అనుపాలెం తీసుకు వెళ్లాడు. అక్కడ ఆటో దిగిన వృద్ధురాలు ఏడుస్తూ దగ్గర్లో ఉన్న  కాలువ మీదుగా వెళ్లడం మొదలు పెట్టింది. దీంతో అనుమానం కలిగిన ఆటో డ్రైవర్ ఆ వృద్ధురాలిని ఆపి ఏం చేయబోతున్నావని అడిగాడు. 

అప్పుడా elderly woman భోరున ఏడుస్తూ తనకు ఐదుగురు కొడుకులు, ఇద్దరూ కూతుళ్ళు ఉన్నారని.. అయినా తాను ప్రస్తుతం పిడుగురాళ్లలోని తన మనవడి దగ్గర ఉంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే, తనను చూసుకునే విషయంలో వారి కుటుంబంలో గొడవలు రావడంతో suicide చేసుకుందాం అని ఇక్కడకు వచ్చినట్టు తెలిపింది.

ఆ వృద్ధురాలి హృదయ విదారక కథనానికి ఆటో డ్రైవర్ కరీముల్లా మనసు కరిగింది. వెంటనే   స్పందించిన కరిముల్ల ఆ వృద్ధురాలికి నచ్చ చెప్పి ఆటో వద్దకు తీసుకు వస్తున్న తరుణంలో అటుగా వెళ్తున్న రాజుపాలెం జెడ్ పిటిసి సునీత రెడ్డి  వివరాలు కనుక్కొని చలించి వృద్ధురాలిని స్వయంగా  పిడుగురాళ్ల పట్టణ స్టేషన్ కు తీసుకు వచ్చారు.

పట్టణ సీఐ ప్రభాకరరావు వెంటనే సమస్యను రాజుపాలెం ఎస్ఐ అమీర్ దృష్టికి తీసుకు వెళ్లి ఆ వృద్ధురాలి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్