
ఏపీ అసెంబ్లీ సమావేశాల (ap assembly sessions) సందర్భంగా శుక్రవారం టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఆయన సతీమణి నారా భువనేశ్వరిని (nara bhuvaneshwari) ఉద్దేశించి అధికార వైసీపీ (ysrcp) ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబం (nandamuri family) భగ్గుమంది. భువనేశ్వరి సోదరుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఈ (Nandamuri Balakrishna)వివాదంపై స్పందించారు. తన అక్క జోలికి వస్తే మెడలు విరిచేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో బాలయ్య శనివారం తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో పరిణామాలు, అధికార వైసీపీ పోకడలపై బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాను ఒక శాసనసభ్యుడినని తన మీదకు రావచ్చొని.. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీదకు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి తల్లులు, భార్యలు, పిల్లలు ఉన్నారని, పర్సనల్‌గా టార్గెట్ చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని హెచ్చరించారు. తన చెల్లి హెరిటేజ్ నడుపుతుందని.. సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వాళ్లలో ఎవరైనా ఇలా చేసారా అని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్ము అంతా ఇంట్లోకి చేర్చడమే వాళ్ల పని అని మండిపడ్డారు. వాళ్ల ఇంట్లో ఆడవాళ్లు కూడా చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
తాము వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శలు చేయలేదని అన్నారు. గోడ్ల చావిట్లో ఉన్నామా..? అసెంబ్లీలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడం సాధారణంగా జరుగుతుందని.. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదని అన్నారు. ఏకపక్షంగా శాసనసభను నడుపుతున్నారని.. బాలకృష్ణఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం లేదన్నారు.
చంద్రబాబు చెప్పడం వల్లే ఇన్నాళ్లూ సహనంగా ఉన్నాయమని.. ఇకపై నోరు తెరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్‌గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని బాలకృష్ణ అన్నారు. వీర్రవీగి మాట్లాడేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. అయితే ఈ సమావేశం జరగడానికి ముందు మీడియా ప్రతినిధులను బాలయ్య నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. అయితే ఆ కాసేపటికే గొడవ సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది.
"