మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసిన ఆటో డ్రైవర్: కూతురు ఆర్తనాదాలు

By telugu teamFirst Published Aug 13, 2020, 10:01 AM IST
Highlights

ఆవు దాడి చేయడంతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఆటో డ్రైవర్ రోడ్డు మీదనే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరులో చోటు చేసుకుంది. 

చిత్తూరు: కరోనా వైరస్ మానవ సంబంధాలను పూర్తిగా తుడిచి పెట్టేస్తోంది. మనుషుల గుండెల్లో తడి కూడా ఆరిపోతోంది. అందుకు తగిన అమానుషమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా గంగవరం గ్రామంలో సంభవించింది.

గంగవరం గ్రామానికి చెందిన వెంకట్రామయ్య (73) అనే వ్యక్తి ఇంటి బయట పడుకున్నప్పుడు ఆవు దాడి చేసింది. దాడిలో వెంకట్రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. పక్కింటి ఆవు అతని గుండెలపై తొక్కడంతో పక్కటెముకలు విరిగాయి.

ఆదివారం ఉదయం కూతురు హేమలత అతన్ని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వచ్చింది. వారు అతన్ని పరీక్షించి స్కానింగ్ చేయాలని, తమ వద్ద ఆ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపించారు. దాంతో ఆమె తన తండ్రిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి ఇంటికి తీసుకుని వెల్లింది. 

బుధవారం ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో మళ్లీ తండ్రిని ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అక్కడ డాక్టర్ లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్తుండా వెంకట్రామయ్య ఆటోలోనే మరణించాడు. దాంతో ఆటో డ్రైవర్ శవాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.

నడిరోడ్డు మీద శవంతో రోదించడం ప్రారంభించింది. తన తండ్రి కరోనాతో చనిపోలేదని ఆమె చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆమె ఆర్తనాదాలు ఎవరికీ పట్టలేదు.

click me!