టెలీహెల్త్ సర్వీసులకు నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్ ఇచ్చారని, కనీసం బడ్జెట్ ఆమోదం కూడా లేదని, ఆర్థికశాఖ అనుమతి కూడా తీసుకోలేదని ఏసీబీ అచ్చెన్నాయుడిపై ఇచ్చిన రేమండ్ రిపోర్టులో పేర్కొంది.
ఈఎస్ఐ స్కాం కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రేమండ్ విధించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో ఆయన రేమండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
టెలీహెల్త్ సర్వీసులకు నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్ ఇచ్చారని, కనీసం బడ్జెట్ ఆమోదం కూడా లేదని, ఆర్థికశాఖ అనుమతి కూడా తీసుకోలేదని ఏసీబీ అచ్చెన్నాయుడిపై ఇచ్చిన రేమండ్ రిపోర్టులో పేర్కొంది.
undefined
ప్రభుత్వంతో ఎంవోయూ కూడా చేసుకోలేదని, గతంలో అనుభవంలేని సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, టెండర్లు పిలవకుండా అప్పనంగా కాంట్రాక్టు కట్టబెట్టడానికి కారణం కూడా చూపలేకపోయారని ఏసీబీ టీహెలిపింది.
ఆదాయం, వాణిజ్యపన్నుల శాఖ సర్టిఫికెట్లు కూడా లేవని, టెలీహెల్త్ సర్వీసులకు కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని... అచ్చెన్నాయుడు మూడుసార్లు ఒత్తిడి తీసుకువచ్చారని, ఆయన ఒత్తిడి మేరకే కాంట్రాక్టులు ఇచ్చారని వారు నివేదికలో పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే... రూ.4.15కోట్లు విడుదల చేశామని డైరెక్టర్ రమేష్‌కుమార్ చెప్పారని, అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా, టీడీఎల్పీ ఉపనేతగా ఉన్నారని, ఆయనకున్న పలుకుబడి దృష్ట్యా, ఈ కేసులో మరింతమందిని విచారించాల్సి ఉందని, అనేక డాక్యుమెంట్లను, సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని, కాబట్టి కేసు విచారణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అచ్చెన్నాయుడు, రమేష్‌కుమార్ లకు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని వారు పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడుపై 409, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసులను నమోదు చేసారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఈఎస్‌ఐ డైరెక్టర్ రమేష్‌కుమార్. రెండో నిందితుడిగా అచ్చెన్నాయుడు. మూడో నిందితుడిగా టెలీహెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్‌రెడ్డి పేర్లను రేమండ్ రిపోర్టులో చేర్చింది ఏసీబీ.
నిరాధారంగా ఆయనను అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఏ కాగా.. ఆధారాలున్నాయి కాబట్టే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశామంటూ ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు.
శనివారం ఈఎస్‌ఐ స్కాంపై ఏసీబీ జేడీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడ్ని విచారణకు రావాలని కోరలేదని చెప్పారు. ఈఎస్‌ఐ స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జేడీ జనార్ధన్, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈఎస్ఐ నిధుల కేటాయింపులో 2018-19కి సంబంధించి రూ.988 కోట్లలో రూ.150 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించామని రవికుమార్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మంది ముద్దాయిలను గుర్తించామని...మరింత మందిని విచారణ చేయబోతున్నట్లు తెలిపారు.