సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఎండీ గోపాలకృష్ణకు తీవ్ర అస్వస్థత

By telugu teamFirst Published May 4, 2021, 8:44 AM IST
Highlights

సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టయిన ఆ సంస్థ ఎండీ గోపాలకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆ సంస్థ ఎండీ గోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

ఊపిరి అందడం లేదనే కారణంతో సోమవారం మధ్యాహ్నం గోపాలకృష్ణను జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. మరోసారి అదే సమస్య తలెత్తడంతో రెండోసారి ఆస్పత్రికి తరలించారు కోవిడ్ టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. 

అయితే, కోవిడ్ లక్షణాలు మాత్రం ఉన్నాయి. దీంతో సీటీ స్కాన్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి కోవిడ్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ చేయలేదు. దీంతో మరో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి అత్యవసర పరీక్షలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. గోపాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గోపాలకృష్ణతో పాటు ప్రకాశం జిల్లా సహకార శాఖాధికారిని ఎసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు గంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రపై సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కారణంతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

click me!