ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Published : Jun 06, 2019, 02:40 PM IST
ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

సారాంశం

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం ఉన్నత స్థాయి సీమక్షా సమావేశం జరిగంది. 

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం ఉన్నత స్థాయి సీమక్షా సమావేశం జరిగంది. ఈ సమావేశానికి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ డీజీ, సీఆర్డీఏ కమిషనర్ నరసింహ ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సచివాలయంల సమీపంలోని పార్కింగ్ ఏరియాలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయా అని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవులు దక్కింది వీరికే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

మరో వైపు సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయ పనులను వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. మంత్రి వర్గ విస్తరణ రోజే జగన్ కూడా తన ఛాంబర్ లోకి అడుగుపెట్టనున్నారు. శనివారం ఉదయం 8.30గంటలకు జగన్‌ తన ఛాంబర్‌లో అడుగుపెడతారని వైసీపీ నేతుల చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే