క్విడ్ ప్రొకో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది.
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కాకుండా సీఎం జగన్ కి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వద్దని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. కేసును ఆలస్యం చేయడానికి జగన్ ఆడుతున్న గేమ్ ప్లాన్లో భాగంగానే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని పేర్కొంది. quid pro quo కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. CBI న్యాయవాది సురేందర్ వాదనలు వినిపించారు. ‘దిగువ కోర్టులో విచారణను ఆలస్యం చేయడానికే ఇలా చేస్తున్నారు. ఇదంతా Game Plan. సిబిఐ కేసులు నమోదై పదేళ్ళు అవుతుంది. ఇంకా Discharge petitions దశ కూడా దాటలేదు. నిందితులు ఉద్దేశపూర్వకంగా ఒకరి తర్వాత మరొకరు పిటిషన్లు వేస్తున్నారు. అభియోగాల నమోదు అయ్యాక హాజరు నుంచి మినహాయింపు తీసుకోవడం వేరు. అభియోగాలకు ముందే మినహాయింపు ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదు’ అని స్పష్టం చేశారు.
Personal exception పై గతంలో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్లను దిగువ కోర్టు, ఇదే హైకోర్టు కొట్టేశాయి అని గుర్తు చేశారు. ప్రస్తుతం Petitioner ఇంకా పెద్ద హోదాలో ఉన్నార..ని ఇప్పుడు ఇంకా ఎక్కువగా సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత మినహాయింపు ఇప్పటికే తీర్పు ఇచ్చినందున మళ్లీ దానిని సమీక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు.
మహిళా ఎంపీడీవోపై వైసీపీ నేత వీరంగం.. చెప్పింది వినకపోతే చీరేస్తామంటూ బెదిరింపు...
వివిధ కారణాలతో హాజరు నుంచి మినహాయింపు అడిగిన ప్రతిసారీ దిగువ కోర్టు మంజూరు చేసిందన్నారు. ఒకసారి అభియోగాలు నమోదు చేయడం పూర్తయితే ఒక ఏడాదిలోపు Trial పూర్తి కావలసి ఉంటుందని తెలిపారు. కేసులు నమోదై పదేళ్లు అవుతోందని.. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందన్నారు. ys jagan తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
సిబిఐ కోర్టులో గాని, హైకోర్టులో గాని తామెప్పుడూ వాయిదాలు తీసుకోలేదని.. ఆలస్యానికి తాము కారణం కాదన్నారు. సిబిఐ కేసులను ముందు విచారించాలా? లేక ఈడి కేసులనా? అన్న అంశంపై విచారణ జరిగిందని తెలిపారు. అప్పట్లో పిటిషనర్ ఎంపీగా ఉన్నారని, హైదరాబాదులోనే నివాసం ఉన్నారు కాబట్టి.. వారంలో ఒక రోజు కోర్టుకు వస్తే ఇబ్బందేమీ లేదని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
పిటిషనర్ ఇప్పుడు ఆంధ్ర సీఎం అయ్యారని.. అక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు. పరిస్థితులు మారినందున వ్యక్తిగతంగా మినహాయిపు ఇచ్చే అంశంపై తాజాగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘గతంలో క్విడ్ ప్రొకో కేసులపై సీబీఐ కోర్టులో వారంలో ఒకరోజు విచారణ జరిగేది. ఇప్పుడు వారంలో ఐదు రోజులు జరుగుతుంది. ఒక Chief Minister వారంలో ఐదు రోజులు కోర్టుకు హాజరు కాలేరు. పాలనా వ్యవహారాలు గాడి తప్పుతాయి. ప్రత్యక్ష హాజరు తప్పని సరి అనుకున్నప్పుడు పిటిషనర్ హాజరవుతారు. అభియోగాలకు ముందు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వరాదని ఎక్కడా లేదు. ఈ అంశం కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
దాల్మియా సిమెంట్స్ కేసులో వాదనలు..
Dalmia Cements కు మైనింగ్ లీజు వ్యవహారంలో ఆ సంస్థ ఎండి పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. చట్టబద్ధంగా తమకు Mining lease కేటాయించారని అలాంటప్పుడు క్విడ్ ప్రొకో ఆరోపణలకు ఆస్కారమే లేదని దాల్మియా సిమెంట్ తరఫున సీనియర్ న్యాయవాది పీవీ కపూర్ స్పష్టం చేశారు.