తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు: బంద్ రోజు ఎర్రబ్యాడ్జీలతో నిరసన

By Nagaraju penumalaFirst Published Oct 13, 2019, 6:04 PM IST
Highlights

ఈనెల 19 న తెలంగాణా రాష్ట్రం బందుకు మద్దతుగా ఏపిలో ఆర్టీసీ ఉద్యోగులం అందరం ఎర్రబ్యాడ్జీలతో విదులకు హాజరై తెలంగాణా ఆర్టీసి ఉద్యోగులకు సంఘీబావం ప్రకటించనున్నట్లు తెలిపారు. 

విజయవాడ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు ప్రకటించింది ఏపిఎస్ ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్. తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా విజయవాడలో ధర్నాలు నిర్వహించింది.  

సమ్మెలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో ఈనెల 19న ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని తీర్మానించింది. అలాగే ఈనెల 19న ఏపీలో నిరసన తెలిపేందుకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపింది. 

ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వంపై మండిపడ్డారు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదరరావు. ఆర్టీసి కార్మికులు సమ్మె చేపట్టి తొమ్మిదో రోజుకు చేరుకున్నా ప్రభుత్వం మాత్రం మెుండివైఖరి వీడటం లేదని విమర్శించారు. 

ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులను రెచ్చగొట్టేలా కేసీఆర్, మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల ప్రకటనలు చూసే మనస్తాపంతో శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారంలో ప్రభుత్వం  చొరవ చూపనందుకు నిరసనగా మొదటి దశ ఉద్యమంలో భాగంగా ఆదివారం 13 జిల్లాలలో ధర్నా128 డిపోలలో నిర్వహించినట్లు తెలిపారు. 

అలాగే ఈనెల 19 న తెలంగాణా రాష్ట్రం బందుకు మద్దతుగా ఏపిలో ఆర్టీసీ ఉద్యోగులం అందరం ఎర్రబ్యాడ్జీలతో విదులకు హాజరై తెలంగాణా ఆర్టీసి ఉద్యోగులకు సంఘీబావం ప్రకటించనున్నట్లు తెలిపారు. 

అప్పటికీ తెలంగాణా ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించపోతే మాత్రం జెఏసి రాష్ట్రకమిటి చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.  

తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు రోజు రోజుకు ప్రజలు/కార్మికసంఘాలు మద్దతు పెరుగు తున్నందున దైర్యంగా పోరాటాలు చేయాలి గాని ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఏపియస్ ఆర్టీసి జెఏసి కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మెుండివైఖరి మానుకొని ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఈనెలలో పనిచేసిన కాలానికి జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 

click me!