స్థానిక సంస్థల ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ఎస్ఈసీ

By narsimha lodeFirst Published Nov 18, 2020, 2:14 PM IST
Highlights

:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

అమరావతి:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.ఎన్నికల నిర్వహణ విషయమై ఏపీ హైకోర్టు  తెలిపిన తర్వాతే దశల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎస్ఈసీ భావిస్తోంది.

రాష్ట్రంలో కరోనా తగ్గనందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని  ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ విషయమై ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ లేఖ రాశాడు.ఈ లేఖపై ఎస్ఈసీ కూడ ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

ఈ పరిణామాలన్నింటిని బుధవారం నాడు రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు ఎస్ఈసీ.మరో వైపు ఈ పరిణామాలన్నింటిపై కూడ ఏపీ ఎస్ఈసీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.

click me!