ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. పరీక్షలైన 20 రోజుల్లోనే రిజల్ట్స్

By Siva KodatiFirst Published Jan 27, 2023, 9:40 PM IST
Highlights

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ వన్ స్క్రీనింగ్‌లో 6,455 మంది క్వాలిఫై అయ్యారు. ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. 111 పోస్టులకు జనవరి 8న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 88 వేల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. గ్రూప్ వన్ స్క్రీనింగ్‌లో 6,455 మంది క్వాలిఫై అయ్యారు. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక అయ్యారు. రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!