అదానీ గంగవరం కార్మికుల నిరసన:యాజమాన్యానికి 9 డిమాండ్లు, వారం రోజుల డెడ్‌లైన్

By narsimha lodeFirst Published Aug 17, 2023, 3:38 PM IST
Highlights

అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి  తొమ్మిది డిమాండ్లను కార్మికులు  పెట్టారు. ఈ విషయమై  వారంలో తేల్చాలని  కార్మికులు డిమాండ్  చేస్తున్నారు.  ఈ విషయమై   యాజమాన్యంతో చర్చిస్తున్నారు.

విశాఖపట్టణం: నగరంలోని అదానీ గంగవరం పోర్టు  కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి  గురువారంనాడు మధ్యాహ్నం చర్చలు జరిగాయి.  అయితే ఈ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.అయితే  కార్మికులు  యాజమాన్యం ముందు  తొమ్మిది డిమాండ్లను పెట్టారు.అయితే  కార్మిక సంఘాల డిమాండ్లలో మూడు డిమాండ్లపై  యాజమాన్యం నుండి సానుకూలత వ్యక్తమైంది.

అయితే  మిగిలిన డిమాండ్లను కూడ పరిష్కరించాలని   కార్మిక సంఘాలు కోరుతున్నాయి.ఈ విషయమై యాజమాన్యానికి వారం రోజుల సమయం ఇచ్చాయి.    పోర్టు నిర్మాణానికి  స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు తమ భూములు  ఇచ్చారు. అయితే  ఈ భూములు ఇచ్చిన వారికి పోర్టులో ఉద్యోగం కల్పించారు. అయితే  పోర్టులో  ఉద్యోగం చేస్తున్న వారికి కనీస వేతనాలు కూడ అమలు చేయడం లేదని కార్మికులు   చెబుతున్నారు.  తమకు కనీసంగా  నెలకు రూ. 36,500 చెల్లించాలని  కార్మికులు డిమాండ్  చేస్తున్నారు.విధుల నుండి తొలగించిన కార్మికులను వెంటనే  పనిలోకి తీసుకోవాలని కోరుతున్నారు. వీఆర్ఎస్ తీసుకొంటే  ఒక్కో కార్మికుడికి రూ. 50 లక్షలు చెల్లించాలని  కార్మికులు కోరుతున్నారు.  ఈ విషయాలపై వారం రోజుల్లో తమ వైఖరిని చెప్పాలని కార్మికులు  యాజమాన్యానికి అల్టిమేటం  ఇచ్చాయి. ఈ విషయమై  కార్మికులు  యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు.  

also read:విశాఖ అదానీ గంగవరం పోర్టు వద్ద కార్మికుల ఆందోళన: ఆర్డీఓ చర్చలు, కొనసాగుతున్న ఉద్రిక్తత

కాంట్రాక్టు కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ  45 రోజులుగా  ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా కూడ యాజమాన్యం నుండి స్పందన రాకపోవడంతో  ఇవాళ పోర్టు ముట్టడికి  కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.  పోర్టులోకి  కార్మికులు వెళ్లేందుకు  ప్రయత్నించడంతో  ఉద్రిక్తత నెలకొంది.  ముళ్లకంచెలు,బారికేడ్లను తోసుకుంటూ  కార్మికులు  పోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కార్మికులు, నిర్వాసితులను  పోలీసులు అడ్డుకున్నారు.  ఈ క్రమంలో ఇరువురికి గాయాలయ్యాయి. పోర్టు గేటు వద్దే కార్మికులు బైఠాయించి నిరసనకు దిగారు.  ఆర్డీఓ  వచ్చి  కార్మికులతో చర్చలు జరిపారు.  ఈ సమయంలో తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చారు కార్మికులు.


 

click me!