వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్‌లకు ఏపీ హైకోర్టు నోటీసులు..

Published : Mar 28, 2023, 03:06 PM IST
వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్‌లకు ఏపీ హైకోర్టు నోటీసులు..

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే  జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుణ్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. 

వైసీపీ ఎమ్మెల్యే  జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీచేసింది. నందిగామలో నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని ధాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నందిగామ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని.. ఇందుకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేద్దామన్న స్పందించడం లేదని పిటిషనర్ తెలిపారు. ఎమ్మెల్యే జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుణ్.. వారి అనుచరులతో కలిసి నిబంధనలకు ఇసుక తవ్వకాలు చేపట్టడం వలన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే ఏపీ  హైకోర్టు.. వైసీపీ ఎమ్మెల్యే  జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్‌, మైనింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌తో మరికొందరికి కూడా నోటీసులు జారీచేసింది. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!