ఏపీలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా అనుమతించని అధికారులు

By narsimha lode  |  First Published Jan 8, 2023, 12:16 PM IST

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు  ఇవాళ ప్రారంభమయ్యాయి.  ఒక్క నిమిషం ఆలస్యమైనా  అభ్యర్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.  ఇవాళ లేదా రేపు  ఈ పరీక్షకు సంబంధించిన  కీ ని  అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది. 
 


అమరావతి: రాష్ట్రంలో  గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి.  ఒక్క నిమిషం  ఆలస్యమైనా  అభ్యర్ధులను  పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు అధికారులు.ఈ పరీక్షలు నిర్వహించేందుకు  297 పరీక్షా కేంద్రాలను  ఏర్పాటు  చేశారు. ఉదయం  , మధ్యాహ్నం  గ్రూప్  -1 పరీక్షలకు సంబంధించి   పరీక్షలను నిర్వహిస్తున్నారు.  ఇవాళ ఉదయం  10 గంటల నుండి  మధ్యాహ్నం  12 గంటల వరకు  పేపర్  1, మధ్యాహ్నం రెండు గంటల నుండి  నాలుగు గంటల వరకు  పేపర్ -2 పరీక్ష నిర్వహించున్నారు. నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రంలోపలికి అభ్యర్ధులను అనుమతించలేదు.  ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా  వచ్చిన  మహిళా అభ్యర్ధిని  అధికారులు  లోపలికి రానివ్వలేదు. తాను ప్రెగ్నెంట్ గా  ఉన్నందున పరీక్షా కేంద్రానికి  రావడానికి  ఆలస్యమైందని ఆమె  అధికారులకు చెప్పారు. తనకు అనుమతివ్వాలని ఆమె కోరారు. 

ఇవాళ గ్రూప్ -1పరీక్షకు సంబంధించి  1,26,449 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు. ఇవాళ రాత్రికి లేదా  రేపు  ఉదయం  ఎపీపీఎస్‌సీ  గ్రూప్  1 పరీక్షకు సంబంధించి  కీ  విడుదల చేయనున్నారు.ఇదిలా ఉంటే  ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది.ప్రిలిమ్స్ పరీక్ష తో పాటు పాటు మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పు చేర్పులు  చేసింది. గత విధానం తరహాలోనే ప్రిలిమినరీ పరీక్షలో 150 మార్కులకు జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్ లో 450 మార్కులకు 3 పేపర్లు బదులు ఇక నుంచి 300 మార్కులకు రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేశారు.ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారతరాజ్యాగం పేపర్ 1 గా 150 మార్కులకు ప్రశ్నాపత్రంమరో 150 మార్కులకు రెండో ప్రశ్నాపత్రంగా భారత, ఏపీ ఎకానమి, సైన్స్ , టెక్నాలజీ పై ప్రశ్నాపత్రం  ఉండనుంది. 

Latest Videos

click me!