నేను వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకునే: డీఎన్ఏ పరీక్షలకు రెడీ అంటున్న శివచరణ్ రెడ్డి

Published : Jan 08, 2023, 11:59 AM IST
నేను వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకునే: డీఎన్ఏ పరీక్షలకు రెడీ అంటున్న శివచరణ్ రెడ్డి

సారాంశం

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొడుకును తానేనంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. 

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొడుకును తానేనంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తనను కుమారుడిగా అంగీకరించాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం, కొన్ని పాత ఫొటోలను జత చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ లేఖ, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తండ్రి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పుకొచ్చిన శివచరణ్ రెడ్డి.. తన తల్లితో 18 ఏళ్లు కాపురం చేసి వదలిపెట్టారని అన్నారు. తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తమను వదిలిపెట్టారని.. ఆయనను ఎంతగానో మిస్ అయ్యానని చెప్పారు. తనను కొడుకుగా గుర్తించాలని కోరారు. 

‘‘అయితే ఇంతకాలం బయటకు రాకుండా ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నానంటే..  ఒక ఇంటర్వ్యూలో మీకు మగపిల్లలు లేరు అని అన్నారు. మరి నేను ఎవరిని? నేను మీ కొడుకును. నా బాధను గుర్తించండి’’ అని శివచరణ్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

శివచరణ్‌రెడ్డి లేఖపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. ఓ వీడియో విడుదల చేసిన చంద్రశేఖర్ రెడ్డి.. తనపై వచ్చిన కథనాలను ఖండించారు. తనకు ఇద్దరు భార్యలైన తులసమ్మ, శాంతమ్మలకు పుట్టిన ఇద్దరు ఆడ బిడ్డలని.. వారే తన వారసులని ప్రకటించారు. తనకు మగపిల్లలు ఎవరూ లేరని చెప్పారు. శివచరణ్‌రెడ్డికి తాను తండ్రిని కాదన్నారు. శివచరణ్‌రెడ్డి అమ్మ భర్త వెంకటకొండారెడ్డి అని అన్నారు. శివచరణ్ రెడ్డికి వెంకటకొండారెడ్డి తండ్రి అని.. డబ్బుల కోసమే తనను  బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని.. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కొందరు ఈ విషయాన్ని వాడుకొంటున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొవాలంటే నేరుగా రావాలని సవాలు విసిరారు. 

అయితే చంద్రశేఖర్ రెడ్డి వీడియోపై శివచరణ్ రెడ్డి స్పందించారు. తన ఊరులో ఎవరినీ అడిగినా వాస్తవం చెబుతారని అన్నారు. తన సర్టిఫికెట్లన్నింటిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఉందని తెలిపారు. డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!