సమ్మెకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. మా ఆగ్రహం ఎలా వుంటుందో బొత్సకు చూపిస్తాం : సూర్యనారాయణ

By Siva KodatiFirst Published Apr 30, 2023, 9:02 PM IST
Highlights

డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సమ్మెకు సిద్ధమైంది. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని.. ఉద్యోగుల ఆగ్రహం ఎలా వుంటుందో మంత్రి బొత్స సత్యనారాయణకు చూపిస్తామని సూర్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీరికి నచ్చచెప్పేందుకు ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిచింది. ఈ వారం కూడా మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఈ పరిస్ధితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సమ్మెకు సిద్ధమైంది. దీనిలో భాగంగా మే 5న సీఎస్ జవహర్ రెడ్డికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో జరిగిన ఏపీజీఈఏ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు.

ALso Read: ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దుకు నోటీస్: హైకోర్టులో సవాల్ చేసిన సూర్యనారాయణ

Latest Videos

ఈ సందర్భంగా ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని.. ఉద్యోగుల ఆగ్రహం ఎలా వుంటుందో మంత్రి బొత్స సత్యనారాయణకు చూపిస్తామని సూర్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఉద్యమ కార్యాచరణ ఇదే 

  • మే 22న జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు
  • జూన్ 14న సీపీఎస్ రద్దు కోసం జిల్లా కేంద్రాల్లో పోరాటం
  • జూలై 5,6న  నంద్యాల, కర్నూలులో బహిరంగ ప్రదర్శనలు
  • అక్టోబర్ 31న చలో విజయవాడ , బహిరంగ సభ
click me!