చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలో చెప్పాలి: పవన్ పై పోసాని ఫైర్

Published : Aug 04, 2023, 01:20 PM IST
చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలో చెప్పాలి: పవన్ పై  పోసాని ఫైర్

సారాంశం

చంద్రబాబు వెనుక  పవన్ కళ్యాణ్ ఎందుకు  తిరుగుతున్నారో తెలియడం లేదని  ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మెన్ పోసాని కృష్ణ మురళి  చెప్పారు. ఏపీలో చోటు  చేసుకున్న రాజకీయాలపై ఆలోచించాలని ఆయన  కాపులను కోరారు.


హైదరాబాద్: చంద్రబాబును  ఎందుకు  సీఎం చేయాలో  పవన్ కళ్యాణ్ చెప్పాలని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్  పోసాని కృష్ణమురళి  డిమాండ్  చేశారు.శుక్రవారంనాడు  ఏపీ‌ఎఫ్‌డీసీ చైర్మెన్ పోసాని కృష్ణమురళి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  ఎందుకు  చంద్రబాబు వెనుక తిరుగుతున్నారో అర్ధం కాలేదన్నారు. పవన్ లాంటి రాజకీయ నేతలను  ఇంతవరకు  చూడలేదన్నారు. చంద్రబాబు సర్కార్  అవినీతిలో కూరుకుపోయిందని పవన్ కళ్యాణ్ గతంలో చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు.కాపు సామాజిక వర్గానికి చెందిన  పవన్ కళ్యాణ్ చంద్రబాబును గెలిపించాలని చూస్తున్నారన్నారు. 

 కాపులను  ఓడించిన చంద్రబాబును  గెలిపించాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నారు. మీ అన్నను ఓడించినా సరే  చంద్రబాబును గెలిపించాలని ఎందుకు  ప్రయత్నిస్తున్నావని పవన్ కళ్యాణ్  ప్రశ్నించారు  పోసాని కృష్ణమురళి. కాపులెంతో గొప్పవాళ్లే తాను  సినిమాలు తీసినట్టుగా  ఆయన గుర్తు  చేశారు. ఏపీలో  ఏం జరుగుతుందో  కాపు సామాజిక వర్గం ఓటర్లు  ఆలోచించుకోవాలన్నారు. ఇంతకన్న ఎక్కువ మాట్లాడితే తనను కూడ  తిట్టిస్తారని  పోసాని కృష్ణ మురళి  చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు