ఆ పోస్టర్లను తొలగించండి.. డర్టీ హరిపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం

By Siva KodatiFirst Published Dec 23, 2020, 5:01 PM IST
Highlights

ఇటీవల టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయిన ‘డర్టీ హరి’ సినిమాపై సామాజిక వేత్తలు, మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డర్టీ హరి వాల్‌ పోస్టర్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిర్మాత, దర్శకుడు, అడ్వర్టయిజ్‌మెంట్‌ ఏజెన్సీలపై కేసు నమోదు చేయాలని ఆమె డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వాసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి సెంటర్‌ సహా ఇతర పట్టణాలలో అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పద్మ విజ్ఞప్తి చేశారు. 

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన ‘డర్టీ హరి’లో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు.

కాగా.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వెంకటగిరి వరకు ఉన్న మెట్రో పిల్లర్లపై ఈ ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లను అంటించారు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా... యువతను తప్పుదోవ పట్టించే రీతిలో ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లు ఉన్నాయంటూ నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై హైదరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 
 
click me!