ఛైర్మన్‌గా క్రైస్తవుడు, స్కామ్‌లో దొంగలు సభ్యులు.. టీటీడీ పాలకమండలిపై అచ్చెన్నాయుడు విమర్శలు

Siva Kodati |  
Published : Aug 26, 2023, 05:42 PM IST
ఛైర్మన్‌గా క్రైస్తవుడు, స్కామ్‌లో దొంగలు సభ్యులు.. టీటీడీ పాలకమండలిపై అచ్చెన్నాయుడు విమర్శలు

సారాంశం

ఏపీ ప్రభుత్వం కొత్తగా నియమించిన టీటీడీ బోర్డు సభ్యులపై విమర్శలు చేశారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీటీడీ ఛైర్మన్‌గా క్రైస్తవుడిని నియమించారని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి స్థానం కల్పించారని ఆయన మండిపడ్డారు. 

ఏపీ ప్రభుత్వం కొత్తగా నియమించిన టీటీడీ బోర్డు సభ్యులపై విమర్శలు చేశారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారని దుయ్యబట్టారు. టీటీడీ ఛైర్మన్‌గా క్రైస్తవుడిని నియమించారని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి కూడా పాలకమండలిలో చోటు కల్పించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పెట్టిన కష్టాలు మరిచిపోకుండా కార్యకర్తలు మరింత కసితో పనిచేయాలని ఆయన సూచించారు. 

ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తూ సభలు నిర్వహిస్తామని.. కోటి ఇళ్లను సందర్శించేలా కార్యక్రమాన్ని రూపొందించామని ఆయన వెల్లడించారు. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ఈ నెల 31 నాటికి 200వ రోజుకు చేరుకుంటుందని అచ్చెన్నాయుడు చెప్పారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ అధినేత 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. 

ALso Read: టీటీడీ కొత్త పాలకమండలి : 24 మందితో జాబితా రెడీ.. ఎమ్మెల్యేలు సామినేని , పొన్నాడ సతీష్‌‌లకు చోటు

కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటన  విడుదల చేసింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. అయితే ఇందులో కొందరి పేర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమేనని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించారని పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. 

ఢిల్లీలో మద్యం కుంభకోణంలో పాలుపంచుకున్న శరత్ చంద్రారెడ్డి, అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఢిల్లీ హైకోర్టు ఎంసీఐ నుంచి తొలగించిన కేతన్ దేశాయ్ వంటి వ్యక్తులను టీటీడీ బోర్డుకు నామినేట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు, తిరుమల ఆలయ పవిత్రతపై ఏపీ సీఎం జగన్‌కు నమ్మకం లేదని విమర్శించారు. టీటీడీ పవిత్రను మసకబరిచే నియామకాలను బీజేపీ ఖండిస్తుందని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations