‘‘ఒక పార్టీని నడిపే వ్యక్తి అందరికి ఆదర్శంగా ఉండాలి కాని జగన్ రెడ్డి తీరు దీనికి విరుద్ధంగా ఉంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవిఎం బాక్సును ధ్వంసం చేసి మాచర్లలో విధ్వంసం సృష్టించిన వ్యక్తి, ఒక నేరస్తుడిని జగన్ రెడ్డి వెనకేసుకురావడం సిగ్గుచేటు.’’
బాబాయి చనిపోతే పట్టించుకోని జగన్ రెడ్డి... రూ.25 లక్షలు ఖర్చుపెట్టి మాచర్లలో అరాచకం సృష్టించి కటకటాల్లోకి వెళ్లిన ఖైదీని పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లిని పరామర్శించడానికి వచ్చిన జగన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. ఇకనైనా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని మారాలని సూచించారు. లేదంటే ప్రజలే మళ్లీ బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పల్లా శ్రీనివాసరావు ఇంకా ఏమన్నారంటే...
‘‘ఒక పార్టీని నడిపే వ్యక్తి అందరికి ఆదర్శంగా ఉండాలి కాని జగన్ రెడ్డి తీరు దీనికి విరుద్ధంగా ఉంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవిఎం బాక్సును ధ్వంసం చేసి మాచర్లలో విధ్వంసం సృష్టించిన వ్యక్తి, ఒక నేరస్తుడిని జగన్ రెడ్డి వెనకేసుకురావడం సిగ్గుచేటు. ఏ నాయకుడైనా ప్రజలకు ఆదర్శంగా ఉండాలనుకుంటాడు.. ప్రజల్లో నమ్మకాన్ని నెలకొలుపుకోవాలని చూస్తాడు. కాని ఒక క్రిమినల్ ను జగన్ ను వెనకేసుకురావడం బాధాకరం. జగన్ రెడ్డి వెళ్లే తీరు చూస్తే జగన్ మారడని అర్థం అవుతోంది. మళ్లీ జగన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు. మోసపూరిత హామీలతో గెలిచారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. గడిచిత ఐదేళ్లు ప్రజలను మోసం చేసింది జగన్ రెడ్డే. గత ఐదేళ్లలో నిత్యవసర ధరలు పెంచి పేదల పొట్టకొట్టారు. మీ ధనదాహానికి కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు నీరుద్యోగులను వంచించారు. రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులను మోసం చేశారు. డ్వాక్రమా మహిళలను దగాచేశారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఎస్సీ, ఎస్టీల ప్రాణాలు తీశారు’’ అని పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు.
‘‘పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ముసేశారు. సుమారు 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారు. రాష్ట్రానికి జీవనాడైన పోలవరాన్ని పక్కరాష్ట్రాలకోసం విధ్వంసం చేశారు. 30 లక్షల ఆయకట్టును ఎండగట్టారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఆదర్శంగా లేకుంటే... అతని వెనుక క్రిమినెల్స్ మాత్రమే ఉంటారు. మేము ప్రజలకు ఆదర్శంగా ఉంటాం... ప్రజల కోసం పనిచేస్తాం. జగన్ పాలనలో ప్రజారాజధిని అమరావతిలో రైతులు కన్నీరు చూశారు. అధికారంలో లేనప్పుడు 33 వేల ఎకరాలు ఉంటే చాలని... అమరావతే రాజధాని అని కల్లబొల్లి కబర్లు చెప్పి అదికారంలోకి వచ్చి మాట మార్చారు. చట్టసబల్లో తీసుకున్న నిర్ణయాలను గౌరవించకుండా... అధికారంలోకి వచ్చాక రైతులను ఇబ్బంది పెట్టి అమరావతిని విధ్వంసం చేశారు. ఇవి అన్ని ప్రజలు గమనించారు కాబట్టే వైసీపీని ఇంట్లో కూర్చబెట్టారు’’ అని పల్లా గుర్తుచేశారు.
‘‘విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని చెప్పి గంజాయి రాజధానిని చేశారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖలో దొరకుతున్నాయి. మాట్లాడితే బీసీ బిడ్డనంటాడు... కాని జగన్ రెడ్డి తీరుతో బీసీలకు జరిగిన నష్టం అపారం, దాదాపు 16 వేల మంది రాజ్యాధికారం కోల్పోయారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి మారాలి. పిన్నెల్లి రామకృష్ట దగ్గరకు వెళ్లడానికి రూ. 25 లక్షల ఖర్చు పెట్టి హెలికాఫ్టర్ లో వెళ్లారు. కాని సొంత బాబాయి చనిపోతే వెంటనే ఎందుకు వెళ్లలేదు.? ఒక పార్టీని నడిపే వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పేలా, ఆదర్శంగా ఉండాలి. నేర చరిత్రతో కూడిన ప్రవర్తతనో పగటి కలలు కనడం జగన్ రెడ్డి మానుకోవాలి. ఇప్పటికైన నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే తీసుకుంటాం. కాని అవాకులు చవాకులు పేళితే ఊరుకోం. చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 2029 లో కూడా ప్రజలు మన్ననలతో మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుంది. క్రిస్టియన్, మైనార్టీల భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. వైసీపీ నేతల కంబద హస్తాలనుండి వాటిని విడిపిస్తాం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.