ఏపీ సీఎస్ నీలం సహానికి షాక్: రాత్రికి రాత్రే మారిన జీవో, ఏం జరిగింది?

By narsimha lodeFirst Published Oct 27, 2020, 10:18 AM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని జారీ చేసిన ఆకస్మికంగా మారిపోయింది. ఓ అధికారి కారణంగానే ఈ జీవో మారిపోయిందని తేలింది.ఈ జివో విషయమై ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని జారీ చేసిన ఆకస్మికంగా మారిపోయింది. ఓ అధికారి కారణంగానే ఈ జీవో మారిపోయిందని తేలింది.ఈ జివో విషయమై ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు (అక్టోబర్ 26) రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇస్తూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ.

అయితే ఈ జీవో ఆదివారం నుండి ప్రభుత్వ అధికారిక జీవోల వెబ్ సైట్ లో కన్పించకుండా పోయింది. అంటే జీవోను తొలగించలేదు. జీవో నెంబర్ ను అలాగే ఉంచి  నాట్ ఇష్యూడ్ అని (జీవో జారీ చేయలేదు) మార్పు చేశారు.

ఈ మార్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా ఉద్యోగులు యధావిధిగా విధులు నిర్వహించాలి.ఆప్షనల్ హాలిడే తీసుకోవడం కుదరదు.

ఈ విషయం తెలియని చాలా మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఆఫ్షనల్ హాలిడే ను మార్పు చేసిన విషయం తెలుసుకొన్న మహిళా ఉద్యోగులు కొందరు సోమవారం నాడు విధులకు హాజరయ్యారు.

అసలు ఆఫ్షనల్ హాలిడే జీవోను ఎందుకు మార్పు చేశారనే విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ఆరా తీశారు.  సీఎస్ ఇచ్చిన జీవోతో సీఎం కార్యాలయంలోని ఓ అధికారి విభేదించారని ప్రచారం సాగుతోంది. దీంతో ఈ జీవోను నాట్ ఇష్యూడ్ గా మార్చారనే ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది.
 

click me!