స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం: హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు

By narsimha lodeFirst Published Nov 4, 2020, 11:16 AM IST
Highlights

గతంలో కంటే కరోనా కేసుల సంఖ్య తగ్గిందని హైకోర్టుకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.బుధవారం నాడు అదనపు అఫిడవిట్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు సమర్పించింది.

అమరావతి: గతంలో కంటే కరోనా కేసుల సంఖ్య తగ్గిందని హైకోర్టుకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.బుధవారం నాడు అదనపు అఫిడవిట్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు సమర్పించింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు అదనపు అఫిడవిట్ ను ఎన్నికల సంఘం దాఖలు చేసింది.

గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినందున ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అఫిడవిట్ లో పేర్కొంది. ఎన్నికల కమిషన్ కు భద్రతను పెంచాలని కూడ ఈ అఫిడవిట్ లో కమిషన్ కోరింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై గతంలోనే ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు నిధులు ఇవ్వడం లేదని, సహకరించడం లేదని ఏపీ ప్రభుత్వంపై ఏపీ ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై  ఏపీ హైకోర్టు  మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలకు సహకరించాలని కోరింది. ఎన్నికల సంఘం సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది. 

click me!